Voting (Photo Credits: ANI)

SPSR Nellore, June 22: ఈ నెల 23న జరగనున్న ఆ‍త్మకూరు ఉప ఎన్నిక పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్‌ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నిక (Atmakur Bypoll 2022) కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.  ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు.

ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు (Atmakur by-election) ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం (Campaigning ends) ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు, పోలింగ్‌ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు.123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్‌ స్టాఫ్‌ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్‌ అధికారులు 38 మంది మాస్టర్‌ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్‌ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు.

ఈ నెల 27న అమ్మఒడి మూడో విడత డబ్బులు పంపిణీ, జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం, పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుక

ఆత్మకూరు ఉపఎన్నికకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ విజయరావు(Vijayarao) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 38 సెక్టార్లకు రూట్ మొబైల్ టీంలు ఉంటాయని, మండలానికో స్ట్రైకింగ్ ఫోర్స్ తిరుగుతుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ల వద్ద సాయుధ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. బాడీ ఓన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని అన్నారు. ఇప్పటి వరకూ రూ.47 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విజయరావు హెచ్చరించారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, bie.ap.gov.in, examresults.ap.nic.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

ప్రస్తుతం 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అధికార వైసీపీ తరఫున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ తరఫున భరత్‌కుమార్‌ ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉంటున్నాయి. మొత్తం రెండు లక్షల 13 వేల338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.