COVID-19 in India (Photo Credits: PTI)

Amaravati, Dec 25: ఆంధ్రప్రదేశ్‌ గడిచిన 24 గంటల్లో 56,409 మందికి కరోనా పరీక్షలు చేయగా 355 మందికి పాజిటివ్‌ (Coronavirus disease (COVID-19) వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,80,430కు (Coronavirus Update) చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 354 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,69,478 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,861. వైరస్‌ బాధితుల్లో కొత్తగా ఇద్దరు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 7,091కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వైరస్‌ విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికుల రాకపోకలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్‌టీపీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది, చంద్రబాబు స్కీమ్ కావాలా..జగనన్న స్కీమ్ కావాలా సర్వేలో జగనన్న స్కీమ్‌కే ఓటేశారు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని చెప్పారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఆమె ఫస్ట్‌ క్లాస్‌ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే సందర్భాలు తక్కువేనని స్పష్టం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

తాడిపత్రిలో 144 సెక్షన్, గొడవకు కారణం ఆ వీడియోనేనా ? డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా, జేసీ ప్రభాకర్ రెడ్డితో సహా ఆయన వర్గీయులు 27 మందిపై కేసు నమోదు, ఘటనపై ఫిర్యాదు చేయనని తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి

మహిళ నమూనాలు సేకరించి పుణె ల్యాబ్‌కు పంపామని, ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నందున ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు