
Amaravati, August 19: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదలలో (Pasivedala Village in Kovvur) విషాదం చోటు చేసుకుంది. ఇంటిపెద్ద కరోనా వైరస్‌తో చనిపోవడం ఆ కుటుంబసభ్యులు భరించలేకపోయారు.దీంతో మనస్తాపానికి గురైన చెందిన కుటుంబం గోదావరిలో నదిలో (Family Suicide Attempt) దూకింది. విషాద ఘటన వివరాల్లోకెళితే.. పసివేదలకు చెందిన నరసయ్యకు భార్య పరిమి సునీత, కుమారుడు ఫణికుమార్, కుమార్తె అన్నపూర్ణ ఉన్నారు. కాగా నరసయ్య కోవిడ్‌తో (Covid) బాధపడుతూ ఇటీవలే తనువు చాలించాడు.
ఇంటి పెద్దదిక్కును కోల్పోయామన్న బాధ ఆ కుటుంబాన్ని కలచివేసింది. దీంతో మనస్థాపానికి గురైన నరసయ్య భార్య పరిమి సునీత తన కుమారుడు, కుమార్తెతో కలిసి రైల్వే బ్రిడ్డిపైకి చేరుకొని గోదావరిలో దూకారు. సమాచారం అందుకున్న పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.
ముగ్గురు కుటుంబ సభ్యులు పశివేదల నుంచి కారులో వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముగ్గురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే చుట్టు పక్కల వారు మానసిక ధైర్యాన్ని ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో వారంతో భయంతో పాటుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. కరోనా అంటే జనాలు ఇప్పుడు భయపడే పరిస్థితి రావడంతో ఎవరూ సాయం చేయడానికి ముందుకురాని సంఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. మహిళల మానసిక వేధింపులతో వృద్ధుడు ఆత్మహత్య, సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడిన లక్ష్మీపతిరావు, ఏపీలో తణుకులో విషాద ఘటన
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 26 వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా 882 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,993లకు చేరింది. నిన్న కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తణుకులో నిన్న ఒక్కరోజే 140 కేసులు నమోదు అవగా... ఏలూరులో 40 కేసులు నమోదు అయ్యాయి.