Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

Amaravati, July 12: ఏపీలో గడిచిన 24 గంటల్లో 66,657 నమూనాలను పరీక్షించగా.. 1,578 మందికి పాజిటివ్‌గా (1,578 fresh coronavirus cases) నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,24,421కి (Coronavirus Outbreak) చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 31 కేసులు నమోదయ్యాయి. తాజాగా 22 మంది కరోనా మహమ్మారికి బలవ్వడంతో మొత్తం మృతుల సంఖ్య 13,024కి పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా 3,041 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది.

చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,48,945 నమూనాలను పరిశీలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించని వారికి రూ. 100 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది.

జాగ్రత్త.. ఏపీలో మాస్క్ లేకుంటే రూ.100 జరిమానా కట్టాల్సిందే, మాస్కుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్న ఏపీ ప్రభుత్వం, అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు

కొత్తగా కరోనా వల్ల చిత్తూరు, తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. క‌ృష్ణా, నెల్లూరు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. అలాగే ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు, కర్నూలులో ఒకరు విశాఖలో ఒకర చొప్పున మరణించారు.

ఇక ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3876  మ్యూకోర్‌మైకోసిస్  కేసులు నమోదయ్యాయి. అలాగే దీని బారీన పడి 326 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం నాటికి 2500 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడం ఊరట కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పుడు  కేసులు 1,052 కు తగ్గినట్లు ప్రభుత్వ డేటా చెబుతోంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు, మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇప్పటివరకు, బ్లాక్ ఫంగస్ సోకిన రోగులపై 1,671 శస్త్రచికిత్సలు జరిగాయని ప్రభుత్వ డేటా తెలిపింది. కాగా గత వారం 206 ముకోర్మైకోసిస్ కేసులు నమోదు కాగా అంతకు ముందు 341 కేసులు నమోదయ్యాయని అంటే క్షీణిస్తూ వస్తున్నాని డేటా చెబుతోంది. మరణాలు కూడా మునుపటి వారం 42 నుండి గత వారం 29 కి తగ్గాయి.

గుంటూరు జిల్లా ఇప్పుడు మొత్తం 626 బ్లాక్ ఫంగస్ కేసులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది, వాటిలో 242 ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. కృష్ణ జిల్లాలో ఇప్పటివరకు 586 కేసులు నమోదయ్యాయి, తరువాత చిత్తూరు (568), అనంతపురాము (485), తూర్పు గోదావరి (337), విశాఖపట్నం (328), కర్నూలు (275), కడప (249), ప్రకాశం (194), శ్రీకాకుళం (121) ) నెల్లూరు 61, పశ్చిమ గోదావరి 23 కేసులు నమోదయ్యాయి.

వాస్తవానికి, విజయనగరం ఇప్పుడు సున్నా క్రియాశీల బ్లాక్ ఫంగస్ కేసులతో ఉన్న ఏకైక జిల్లా, ఎందుకంటే ఇది ఒక వారంలో తాజా కేసును నివేదించలేదు. ముకోర్మైకోసిస్ మరణాలలో చిత్తూరు 65, అనంతపురం (43), తూర్పు గోదావరి (41), కృష్ణ (35), కర్నూలు (31), విశాఖపట్నం (30), గుంటూరు (20), శ్రీకాకుళం (18), ప్రకాశం (16) ), కడప (15) మరణాలు సంభవించాయి.