Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు ​​జారీ
Election Commission (photo-ANI)

Amaravathi, May 16: ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వా­లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి గురువారం మధ్యాహ్నం వివరణ ఇవ్వనున్నారు.

పోలింగ్‌ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీ­సులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరి­గ­ణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు

ఎన్నికల్లో హింసకు తావులేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతర హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవర్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని, వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.  వీడియోలు ఇవిగో, రణరంగంలా మారిన పల్నాడు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంబటి రాంబాబు మండిపాటు, ఈసీకీ ఫిర్యాదు

సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయ­డంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యం­త్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేక­పో­వడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకు­న్నట్లు పేర్కొంటున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా బుధవారం సచివాలయంలో సమావేశమై చర్చించారు. విధి నిర్వహణలో ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికా­రులపై చర్చించారు. వీరిని ఇప్పటికే గుర్తించామని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్ని­కల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

అంతకుముందు లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ రోజు, మే 13, తెనాలికి చెందిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని పోలింగ్ బూత్‌లో క్యూలో నిలబడిన ఓటరును కొట్టినందుకు వివాదాన్ని రేకెత్తించారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, తనపై కుల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి తనతో పాటు తన భార్యను దూషిస్తున్నాడని పేర్కొన్నాడు.  వీడియో ఇదిగో, తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ స్టేషన్ సమీపంలో వైఎస్‌ఆర్‌సిపి మరియు టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది, సోమవారం ఇక్కడ పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.సోమవారం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు పోలింగ్ జరిగింది.

అధికార YSRCP మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తోంది, మరో దఫా దృష్టి పెట్టింది, NDA భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఏర్పాటులో భాగంగా, TDP 144 అసెంబ్లీ స్థానాల్లో, జనసేన 21 లో మరియు BJP 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2019 ఎన్నికల సమయంలో, YSRCP ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని నమోదు చేసింది, అసెంబ్లీలోని 175 సీట్లలో 151 స్థానాలు గెలుచుకుంది, టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించింది.