Vizag Shocker: ఎనిమిది మంది భార్యలతో వ్యభిచారం, చేయకుంటే కూతుర్ని వ్యభిచార ముఠాకు అమ్మేస్తానంటూ బెదిరింపులు, విశాఖలో నిత్యపెళ్లికొడుకు లీలలు, నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ సీపీ ఆదేశాలు

విశాఖఫట్నంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు 8 మంది మహిళల్ని (married 8 Women) వివాహం చేసుకుని వారితో వ్యభిచారం (adultery) చేయించేందుకు రెడీ అయ్యాడు.

Vizag Shocker: ఎనిమిది మంది భార్యలతో వ్యభిచారం, చేయకుంటే కూతుర్ని వ్యభిచార ముఠాకు అమ్మేస్తానంటూ బెదిరింపులు, విశాఖలో నిత్యపెళ్లికొడుకు లీలలు, నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ సీపీ ఆదేశాలు
Crime Against Women. (Photo Credits: IANS)

Visakhapatnam, Mar 31: విశాఖఫట్నంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు 8 మంది మహిళల్ని (married 8 Women) వివాహం చేసుకుని వారితో వ్యభిచారం (adultery) చేయించేందుకు రెడీ అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ పట్నంలో అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఎనిమిది మందిని ఒకరికి తెలియకుండా మరొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారితో కొన్నాళ్లపాటు కాపురం చేసి వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు.

గంజాయి వ్యభిచార ముఠాలో సంబంధాలున్న ఈ నిత్య పెళ్లికొడుకు భార్యలతోనే కాకుండా తన మొదటి భార్య కుమార్తెను కూడా వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురిచేశాడు. మాట వినకపోతే చంపుతానంటూ తుపాకీ, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మీని వ్యభిచారం వృత్తిలో దింపి చిత్రహింసలు పెట్టాడు. దీంతో కీచక భర్త ఆగడాలపై గత నెలలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బాలికను కిడ్నాప్ చేసి..అత్యంత దారుణంగా హింసించిన దివ్యాంగుడు, భిక్షాటన చేయాలని ఒత్తిడి, బాలిక ఒప్పుకోకపోవడంతో దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన తణుకు పోలీసులు

భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులకు అరుణ్ కుమార్‌కు సంబంధాలున్నాయని, అందుకే అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళ సంఘాలను ఆశ్రయించడంతో వారు ఈ విషయాన్ని సీపీ మనీష్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమకు అతని నుంచి ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్‌కు బాధితులు వాయిస్ మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన సీపీ నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఏడాది నుంచి నాతో సెక్స్ చేయడం లేదు, పైగా బీరు తాగమని నా భర్త పదే పదే హింసిస్తున్నాడు, గుజరాత్‌లో సైకోలో మారిన ఎన్నారై, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన అతని భార్య

కాగా కేసు నమోదులో నిర్లక్ష్యంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైనా దర్యాప్తు చేయాలని సీపీని ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Mar 31, 2021 04:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).