Srikakulam DSP Suicide: ఏపీలో డీఎస్పీ ఆత్మహత్య, శ్రీకాకుళం డీఎస్పీ కృష్ణవర్మ మృతిపై కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు, అనారోగ్యమే కారణమా..?
bank-of-baroda-manager-wife-murder-case-reveals-madanapalle-police (photo-Getty)

Amaravati, May 15: అనారోగ్య కారణాలతో ఓ పోలీస్‌ అధికారి ఆత్మహత్యకు (Srikakulam DSP Suicide) పాల్పడ్డారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా (Srikakulam Special branch) విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్‌ కూడా అయ్యింది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో (srikakulam) దాదాపు పదేళ్లపాటు ఎస్‌ఐగా పని చేశారు. కూలీలను వెంటాడిన మృత్యువు, ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్, 9 మంది అక్కడికక్కడే దుర్మరణం

అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

డీఎస్పీ కృష్ణవర్మ మృతిపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణవర్మ తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నారని సీఐ షణ్ముఖరావు తెలిపారు. బట్టలు ఆరబెట్టేందుకు తాడు కడుతుండగా జారిపడిపోయినట్లు.. కృష్ణవర్మ కుటుంబసభ్యులు అంటున్నారని షణ్ముఖరావు చెప్పారు.

Here's Tweet

కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో అపస్మారక స్థితిలో పడి కృష్ణవర్మ ఉన్నారు. కృష్ణవర్మ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని, ఆయన ప్రస్తుతం సెలవులో ఉన్నారని సీఐ షణ్ముఖరావు పేర్కొన్నారు.