Mid-Day Meal Scheme in TS: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, ప్రభుత్వ జూనియర్‌,డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం
Telangana CM KCR | File Photo

Hyderabad, July 17: ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Mid-Day Meal scheme in TS) పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో (government junior and degree colleges) డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నాయని కేసీఆర్‌ (CM KCR) అన్నారు.

ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్ఠికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం (Mid-Day Meal scheme) పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణలో 41 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 400కు చేరువైన కరోనా మరణాలు, గత 24 గంటల్లో కొత్తగా మరో 1676 పాజిటివ్ కేసులు నమోదు

జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రఘురామ్‌ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెక్చరర్‌ రఘురామ్‌ను సీఎం అభినందించారు. ఈ నేపథ్యంలోనే కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించారు. రఘురామ్‌ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యావ్యవస్థ పవిత్ర తను కాపాడే ఉద్దేశంతో యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని.. మిగిలినవారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి ఏం చేయాలనే అంశంపై గురువారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం ప్రారం భించాలని సూచించారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుం దని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలల ఎప్పుడు పునఃప్రారంభించాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.