Covid in AP: ఏపీలో యూకే కొత్త కరోనా వైరస్ అలజడి, రాజమండ్రికి చెందిన మహిళకు కొత్త కోవిడ్ స్ట్రెయిన్, రాష్ట్రంలో తాజాగా 326 మందికి కోవిడ్ పాజిటివ్, కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నామని తెలిపిన వైద్యారోగ్య శాఖ కమిషనర్‌
Coronavirus Representational Image (Photo Credits: File Image)

Amaravati, Dec 29: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 మందికి పాజిటివ్‌గా (new Covid-19 cases) నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 881599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7100 మంది మృతి చెందారు.

గత 24 గంటల్లో కరోనా (Covid in AP) నుంచి కోలుకుని క్షేమంగా 364 డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 871116 డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,383 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను పరీక్షించారు

హైదరాబాద్‌లో ఇద్దరికి కొత్త కరోనావైరస్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు నమోదు, దేశంలో తాజాగా 16,432 మందికి కరోనా, భారత్‌లో ఆరుమందికి కొత్త కోవిడ్ పాజిటివ్

ఇదిలా ఉంటే కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై (New Covid Strain in AP) అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్‌ వచ్చిందని, ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్‌ చేశామని పేర్కొన్నారు. 1406 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు.

నువ్వొక బోడి నాయుడివి, పకీర్ సాబ్‌వి, బోడి లింగం కాబట్టే రెండు చోట్ల తొక్కి పడేశారు, పవన్ కళ్యాణ్ శతకోటి లింగాల్లో బోడి లింగం వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వైసీపీ మంత్రులు

1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. మొత్తం 24 పాజిటివ్‌ కేసుల శాంపిళ్లను సీసీఎంబీకి పంపించామని తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్‌ వచ్చిందని నిర్ధారణ అయ్యిందని, మిగిలిన 23 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు