Amaravati, July 8: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని (YS Rajasekhara Reddy Birthday) వైఎస్సార్ రైతు దినోత్సవంగా (YSR Rythu Dinotsavam) నిర్వహిస్తోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (Tadepalli CM Office) నిర్వహించిన వైఎస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పాల్గొన్నారు. తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు, ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, వైఎస్సార్ గురించి ఎవరేమన్నారంటే..
ఈ సందర్భంగా టీడీపీ హయాంలో (TDP Govt) వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం 96.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాగా టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సి బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉంది. అక్కాచెల్లెమ్మలకు ఆస్తిని ఇద్దామంటే టీడీపీ అడ్డుపడుతోంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, స్పందన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రుణాలకు 1150 రూపాయల కోట్లు వడ్డీ బకాయిలు పెట్టింది. 57 లక్షల మంది రైతులకు ఆ బకాయిలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. సున్నా వడ్డీ పథకంపై రైతులకు బకాయిలంటిన్నీ పూర్తిగా చెల్లిస్తున్నాం. మాది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఈరోజున గర్వంగా చెబుతున్నా' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల పాత బకాయిలను కూడా సీఎం జగన్ విడుదల చేశారు. దీంతో పాటు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు.
Here's YSRCP Tweet
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమం. ఈ సందర్భంగా రైతులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను విడుదల చేసిన సీఎం. https://t.co/K3E5WyYGeR #LegendYSRJayanthi #RythuDinotsavam
— YSR Congress Party (@YSRCParty) July 8, 2020
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ రైతులు, ఇతర అధికారులతో మాట్లాడారు. అక్టోబర్‌లో 2019-20కి సంబంధించిన ఖరీఫ్ రుణాల వడ్డీ చెల్లింపులు, మార్చిలో రబీ రుణాల వడ్డీ చెల్లింపు చేస్తామని తెలిపారు. రైతుల కోసం 1907 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ యంత్రాలు ఉంటాయి.ఆర్‌బీకేల ద్వారా పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భదారణ సేవలు అందించనున్నామని తెలిపారు. వైఎస్సార్ పుట్టిన రోజును రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడుతూ ఉత్తర్వులు
గత ప్రభుత్వం పెట్టిన రూ.8,655 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలు, ధాన్యం సేకరణకు చెల్లించాల్సిన రూ.960 కోట్లు, రూ.384 కోట్ల విత్తన బకాయిలను చెల్లించామని ఏపీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.122 కోట్ల బీమా ప్రీమియంను కూడా చెల్లించామన్నారు. రైతులకు 83శాతం ఫీడర్ల ద్వారా పగటిపూటే 9గంటల విద్యుత్ అందిస్తున్నాం. రబీ నాటికి మిగిలిన ఫీడర్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ ఏడాది రైతు బీమా కింద రూ.1456 కోట్లు చెల్లించాం.ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్సాగు చేశాం. రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధిని కూడా ప్రారంభించాం. రూ.3,050 కోట్లతో రైతుల పంటలు కొనుగోలు చేశాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ట్యాక్స్ కూడా రద్దు చేశాం. జలయజ్ఞం పనులు వేగంగా సాగుతున్నాయి.. ఆరు ప్రాజెక్టులను ఈఏడాదే ఆపరేషన్లోకి తీసుకు వస్తున్నాం' అని వైఎస్ జగన్ వెల్లడించారు.