YSRCP Plenary 2022: వైసీపీ పార్టీకి విజయమ్మ రాజీనామా, తెలంగాణలో షర్మిల వెంట నడవబోతున్నట్లు ప్రకటన, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని వెల్లడి
YS Vijayamma

వైసీపీ ప్లీనరీ సమావేశంలో షర్మిల పార్టీపై విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన కూతురు షర్మిల పార్టీ స్థాపించి కష్టపడుతోందన్నారు. ఇక్కడ జగన్‌ను ఆశీర్వదించినట్లే, తెలంగాణలో షర్మిలను కూడా ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ తన అన్నకు ఇబ్బంది కలగకూడదని, తెలంగాణ కోడలిగా తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టుకుందని అన్నారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయాలపై విజయమ్మ సంచలన వ్యాఖ్యలు, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ, నా బిడ్డను మీరంతా ఆశీర్వదించారని తెలిపిన దివంగత వైఎస్సార్ సతీమణి

ఈ మేరకే తెలంగాణలో గట్టి ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇక్కడ జగన్‌కు అక్కడ షర్మిలకు మద్దతు ఎలా ఇస్తారని చాలామంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. అంతేగాక, ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులుగా ఇక కొనసాగలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తన కూతురు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తల్లిగా జీవితకాలం ఇద్దరికీ అండగా ఉంటానన్నారు.

నాకు మీ చల్లని దీవెనలు చాలు, మళ్లీ అధికారంలోకి వస్తాం, ప్లీనరీ వేదికగా ప్రతి పక్షాలపై మండి పడిన సీఎం జగన్, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

వైఎస్సార్‌ బిడ్డగా షర్మిల వైఎస్సార్‌టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్‌ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్‌ జగన్‌ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో  ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి.  వైఎస్సార్‌ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్‌ గెలుస్తారు అని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

వైఎస్సార్‌సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు ప్రస్తుతం నా అవసరం ఉంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈనిర్ణయం తీసుకుంటున్నాం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు, మీ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది అని వైఎస్‌ విజయమ్మ తెలిపారు.