Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Hyderabad, Dec 7: గత కొంత కాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన హైదరాబాద్ నగరంలో మళ్లీ కరోనా కలకలం (Coronavirus Second Wave in Telangana) రేపింది. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో (SR Nagar police station) నలుగురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా (Four SI's and constables tested positive for coronavirus) తేలింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. గత జూన్ నెలలో వచ్చిన వారికి మరోసారి పాజిటివ్ రావడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

గ్రేటర్ ఎలక్షన్లలో భాగంగా డ్యూటీలు చేసిన ఎస్ఐలకు, కానిస్టేబుళ్లు, సిబ్బందికి రెండోసారి కోవిడ్‌ రావడంతో ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ లో కరోనా సెకండ్ వేవ్ వస్తుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో జాగ్రత్తలు పాటించినప్పటికీ.. రెండో విడతలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే కరోనా టీకా రాగానే రోజుకు 10 లక్షల మందికి వేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వారం రోజుల్లో 70 లక్షల మందికి వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇతర టీకాల మాదిరిగా కాకుండా... తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్స్‌ ఇవ్వ డంతోనే కోవిడ్‌–19ను కట్టడి చేయవచ్చని ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన 10 వేల మంది ఏఎన్‌ఎంలు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ... వారి సాయంతో రోజుకు 100 మందికి టీకా వేస్తారు. అలా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.

కరోనాపై ఊరట, 4 లక్షల దిగువకు పడిపోయిన కోవిడ్ యాక్టివ్ కేసులు, దేశంలో తాజాగా 32,981 కేసులు, ఏపీలో 24 గంటల్లో 667 మందికి కరోనా పాజిటివ్

ఒకవేళ టీకా ఎక్కడైనా వికటిస్తే తక్షణమే స్పందించేలా నిష్ణాతులైన డాక్టర్లతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి కూడా శిక్షణ ఇస్తారు. ఇప్పటికే టీకా డ్రైరన్‌ నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ను సరిచూసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని ఉన్నతాధికారులు వీటిని పరిశీలించి చూశారు. ఈ మేరకు మొదటి దశ లబ్ధిదారుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి పంపించింది. వ్యాక్సిన్‌ పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

టీకాలకు సంబం ధించి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతి రోజూ ఉన్నస్థాయి సమీక్షలు చేస్తున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందన్న దానిపై తమకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రాగానే వేగంగా వేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందన్న దానిపై తమకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి.