Col Santosh Babu: కల్నల్ సంతోష్‌ బాబుకు మహావీర చక్ర అవార్డు ప్రకటించే అవకాశం, దేశ రాజధానిలో రిపబ్లిక్ డే రోజున ఆయన కుటుంబ సభ్యులకు అవార్డు అందజేస్తారంటూ వార్తలు, కథనాన్ని ప్రచురించిన జాతీయ వార్తా సంస్థ
Colonel Santosh Babu | File Image | (Photo Credits: Twitter)

Hyderabad, Jan 25: పొరుగు దేశం చైనా గతేడాది గాల్వాన్ లోయలో (Galwan valley) భారత సైనికులపై విరుచుకుపడిన సంగతి విదితమే.. ఈ ఘర్షణలో వీరోచితంగా పోరాడిన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్‌ బాబు (Col Santosh Babu) అమరుడయ్యాడు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణలో చోటు చేసుకున్నాయి. ఈ అమర వీరునికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు దేశ రాజధానిలో (Republic Day) నిర్వహించే వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందజేస్తారని సమాచారం. ఈ ఏడాది మహావీర చక్ర అవార్డు కోసం కల్నల్ సంతోష్ బాబు పేరును ఖరారు చేసినట్లు, కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం ఈ అవార్డును ప్రదానం చేయబోతోన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ధృవీకరించినట్లు జాతీయ వార్తా సంస్థ నిర్ధారించింది. ఆయనతో పాటు సిపాయ్ ఓఝా, హవల్దార్ పళనిలకు అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను అందజేస్తారని తెలుస్తోంది.

సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి

కాగా దేశ రక్షణకు సంబంధించినంత వరకు రెండో అత్యుత్తమ పురస్కారం మహవీర చక్ర. మిలటరీ అవార్డుల్లో అత్యుత్తమైనది పరమవీర్ చక్ర. ఆ తరువాత మహవీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పతాకాలను అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను భావిస్తారు. గతేడాది ఏడాది జూన్ 15వ తేదీన లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఆయనతో పాటు 20 మంది అమరులు అయ్యారు.

గాల్వన్ వ్యాలీ ఘర్షణ, బయటపడిన చైనా సైనికుని సమాధి, ఈ వార్తపై ఇంకా స్పందించని డ్రాగన్ దేశం, ట్విట్టర్లో వైరల్ అవుతున్న చైనా సైనికుని సమాధి రాయి ఫోటో..

ఆయనతో పాటు సిపాయ్ ఓఝా, హవల్దార్ పళనిలకు అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను అందజేస్తారని తెలుస్తోంది. లఢక్ ఈశాన్య ప్రాంతంలో భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ బలగాలను నిరోధించే సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. చైనా తరఫున 50 మందికి పైగా పీఎల్ఏ సైనికులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ దేశ సైన్యాధికారులు దాన్ని ధృవీకరించలేదు.