Heavy Rains in Telugu States: ఏపీ, తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు, మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే కారణం
Heavy Rains To Hit Telugu States in Next 2 Days (Photo-Twitter)

Hyderabad, Sep 14: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.

విశాఖలో (Visakhapatnam) పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఉరుములతో కూడిన జల్లులు (Heavy Rains Forecasted In Telugu States) పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెప్పారు. అటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్‌తోపాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

కృష్ణా జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసాయి. మచిలీపట్నంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 2 లక్షల 15వేల క్యూసెక్కులుంటే.. అవుట్ ఫ్లో 2 లక్షల 5వేల క్యూసెక్కులుగా ఉంది. అటు డెల్టాసాగు, తాగునీటి అవసరాల కోసం కృష్ణా తూర్పు, పడమర కాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

రమేష్‌ ఆస్పత్రిపై విచారణకు ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్‌, ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు, డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశాలు

కడప జిల్లా గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసాల్లోకి నీరు చేరడంతో ముంపు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గండికోట ప్రాజెక్టులో నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే 12 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో ముంపు గ్రామాల్లో మురుగు నీరు ఇళ్లల్లోకి చేరింది. అయితే బ్యాక్ వాటర్ పెరగకుండా గండికోట నుంచి ఇతర ప్రాజెక్టులకు, అక్కడి నుంచి పెన్నానది దిగువకు నీరు వదులుతున్నామని అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.

అల్పపీడన పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా అధికారులకు మంత్రి ఆళ్ళ నాని ఆదేశాలు జారీ చేశారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద ఉధృతికి తమ్మిలేరు పొంగుతున్న నేపథ్యంలో కాజ్ వేల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ఎస్పీ నారాయణ నాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, విద్యుత్‌కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్లనాని సూచనలు చేశారు.

ఏపీలో కరోనాపై భారీ ఊరట, రోజు రోజుకు పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 9,536 మందికి కరోనా, 10,131 మంది కోలుకుని డిశ్చార్జ్‌, యాక్టివ్‌గా 95,072 కేసులు

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. శ్రీశైలం, సాగర్, పులిచింతలతో పాటు ప్రకాశం బ్యారేజీ ఎగున ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా చేరుకుంటోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 2 లక్షల15వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2 లక్ష05వేల క్యూసెక్కులుగా ఉంది. డెల్టా సాగు తాగునీటి అవసరాల కోసం కృష్ణ తూర్పు, పడమర కాలువలకు 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ 60 గేట్లు నాలుగు అడుగులు మేరకు, 10 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఎగువన నల్లమల్లలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరు మండలం సూరేపల్లి గ్రామం వద్ద సగిలేరు వాగు ఉధృతంగా రావడంతో నిన్న సాయంత్రం వాగు అవతల సూరేపల్లి, ఉయ్యాలవాడకు చెందిన 12మంది పశువుల కాపరులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే నిన్న సాయంత్రం అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 1417 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,58,513కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య

అయితే వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 12 మంది పశువుల కాపరులను అవతల వడ్డునున్న తుమ్మలపల్లిలో తలదాచుకునేలా ఏర్పాట్లు చేసి వెనక్కి తగ్గారు. దీంతో నిన్న సాయంత్రం నుండి అవతల ఒడ్డునే పవుశుల కాపరులు తలదాచుకున్నారు. చివరకు అధికారుల కోసం వేచి చూడకుండా గ్రామస్థులు అందరూ కలసి తాళ్ళ సహాయంతో 12 మందిని ఇవతలి వడ్డుకు తేర్చారు. క్షేమంగా బయటపడటంతో 12మంది పశువుల కాపరులు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లాలోని అనంతగిరి మండలం సరియా జలపాతంలో భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన రమేష్ (24)అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు విఘాతం ఏర్పడింది. గల్లంతైన యువకుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. రమేష్ గల్లంతుతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలంగాణలో రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణం పూర్తిగా జలమయమైంది. ఆత్మకూర్ (ఎస్) మండలం నశింపేట వద్ద ప్రవహిస్తోన్న వాగును దాటే క్రమంలో గొర్రెలను తరలించే వాహనం నీటిలో కొట్టుకు పోయింది. వెంటనే గుర్తించిన స్థానికులు వాహనంలోని ముగ్గురిని కాపాడారు. పట్టణ ప్రాంతాలైన శ్రీనివాసకాలనీ, మానస నగర్, ఇందిరమ్మ కాలనీ శివారు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.