Huzurabad Bypoll Result 2021: ఈటెల కోటలో గెల్లు గెలుస్తాడా, గత ఎన్నికల గెలుపు ఫలితాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ఓటు బ్యాంక్ అక్కడ ఎంత, ఈటెలను ఈ సారి ప్రజలు ఆదరిస్తారా..హుజూరాబాద్ గత ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ
Etela Rajender Road Show (Photo-Video Grab)

Hyd, Nov 1: ఈ ఏడాది జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల (Huzurabad Bypoll) గతంలో ఎన్నడూ జరగని విధంగా ఓ యుద్ధాన్నే తలపించింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల (TRS vs BJP)) మధ్యనే పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల బయటకు వచ్చి బీజేపీలో చేరడంతొ ఇక్కడ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మంకగా తీసుకున్నాయి. ఈ సారి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఉపఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్‌ భార్య జమున ఎంతో శ్రమించారు. అలాగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ భార్య శ్వేత కూడా ప్రచారంలో దూసుకుపోయారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారం చేశారు.

హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మధ్యనే వార్ నడిచిందనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లను దక్కించుకున్నారు. అయితే ఈ సారి అతను ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. తాజా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ పోటీలో నిలబడ్డారు.

హుజూరాబాద్‌ తొలిరౌండ్‌లో బీజేపీదే హవా, బద్వేల్‌లో దూసుకుపోతున్న వైసీపీ, రెండు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార పార్టీదే ఆధిక్యం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

గత ఎన్నికలను పరిశీలిస్తే.. హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన నేత ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 ఎన్నికలలో పోటీ చేసి. కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటెల పదవీ స్వీకారం చేశారు. అయితే అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై 2021లో ఈటెల తన పదవికి రాజీనామా చేశారు. అలాగే తన శాసన సభ పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, భారతీయ జనతాపార్టీలో చేరారు. ఫలితంగా హుజురాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

Here's Previous Huzurabad Elections Results 

Huzurabad Bypoll Result 2004

ఇక హుజురాబాద్‌ నియోజగవర్గంలో గతంలో జరిగిన 6 దఫాల ఎన్నికలలో వరుసగా టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తూ వచ్చింది. అందులో ఈటెల నాలుగు సార్లు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేయగా కేవలం 1683 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో నోటాకి 2867 ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఓట్లు నోటా కంటే తక్కువగానే ఓట్లు వచ్చాయి.

ఇక 2004లో జరిగిన హుజూరాబాద్ శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి చెందిన కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డి పై 44,669 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మీకాంతరావుకు 81,121 ఓట్లు దక్కగా, పెద్దిరెడ్డికి 36,451 ఓట్లు వచ్చాయి. అలాగే అప్పటి కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి పోటీ చేసిన ఇనుగాల భీమారావు 5,281 ఓట్లు దక్కించుకున్నారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమన్న కేంద్ర మంత్రి, బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్, కండువా కప్పి ఆహ్వానించిన ధర్మేంద్ర ప్రధాన్, ఈటెలతో పాటు కాషాయపు కండువా కప్పుకున్న పలువురు నేతలు

ఇక 2009 శాసనసభ ఎన్నికలలో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున కృష్ణమోహన్, బీజేపీ నుంచి కె.రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్, ప్రజారాజ్యం తరఫున పి.వెంకటేశ్వర్లు, సమతా పార్టీ నుంచి ఇ.భీమారావు, లోక్‌సత్తా పార్టీ నుండి కె.శ్యాంసుందర్ తదితరులు పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ఈటెట గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల వరుసగా 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.