Telangana Former Health Minister Eatala Rajender | File Photo

Huzurabad, Nov 2: అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో (Huzurabad Bypoll Result 2021) బీజేపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ కి ఉత్కంఠగా మారిన లెక్కింపులో ఈటల రాజేందర్ దే పై చేయిగా నిలుస్తోంది. మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు 15 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరిగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ (Gellu Srinivas) సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో గెల్లుకు ఎదురుగాలి తప్పలేదు. ఇక్కడ బీజేపీ 190 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ 548 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్‌ 358 ఓట్లు సాధించింది

రౌండ్ల వారీ ఫలితాలను చూస్తే..15వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Eatala Rajender) 2149 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 వ రౌండ్‌లో బీజేపీ-5507, టీఆర్‌ఎస్‌- 3358 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం 10 వేలు దాటింది. ఇప్పటివరకు ఈటల రాజేందర్‌ 11,157 ఓట్లలో ఆధిక్యంలో ఉన్నారు. 14వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 1046 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. 14వ రౌండ్‌లో బీజేపీ-4746, టీఆర్‌ఎస్‌-3700, కాంగ్రెస్-152 ఓట్లు వచ్చాయి.13వ రౌండ్‌లో బీజేపీ 1865 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. 13వ రౌండ్‌లో బీజేపీ- 4836, టీఆర్‌ఎస్‌-2971, కాంగ్రెస్‌-101 ఓట్లు వచ్చాయి. 13 రౌండ్లు ముగిసేసరికి ఈటల మొత్తం 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  ఈ రౌండ్ నాటికి మొత్తం బీజేపీ-58,333, టీఆర్‌ఎస్‌- 49,945 ఓట్లు వచ్చాయి.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస యాదవ్ సొంత గ్రామంలో కారు డీలా, ఈటెలకే జై కొడుతున్న హుజురాబాద్

12 రౌండ్‍లో బీజేపీ 1217 ఓట్ల ఆధిక్యం సాధించింది. 12 రౌండ్‌లో బీజేపీ-4849, టీఆర్‌ఎస్‌-3632, కాంగ్రెస్‌-158 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్ల తర్వాత 6523 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ దూసుకుపోతున్నారు. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 385 ఓట్ల ఆధిక్యం సాధిం‍చింది. 11 వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌-4326, బీజేపీ-3941, కాంగ్రెస్‌-104 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు బీజేపీ-48,588, టీఆర్‌ఎస్‌- 43,324 ఓట్లు వచ్చాయి. 11 రౌండ్లు ముగిసేసరికి 5, 306 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ. బీజేపీ అభ్యర్థి ఈటల పదో రౌండ్‌లోను ఆధిక్యం సాధించారు. 10 రౌండ్ల తర్వాత 5631 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకుపోతుంది. పదో రౌండ్‌లో బీజేపీ 526 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ-4295, టీఆర్‌ఎస్‌-3709 ఓట్లు సాధించాయి.

బీజేపీ అభ్యర్థి ఈటల తొమ్మిదో రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించారు. 9వ రౌండ్‌లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం సాధించి మొత్తంగా.. 5,105 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 3,470.. బీజేపీ 5,305.. కాంగ్రెస్‌ 174 ఓట్లు సాధించాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 162 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎనిమిది రౌండ్ల తర్వాత బీజేపీ 35,107.. టీఆర్‌ఎస్‌ 31,837.. కాంగ్రెస్‌ 1175 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్‌లో గెల్లు, కౌశిక్‌ రెడ్డి సొంత గ్రామాల ఓట్ల లెక్కింపు జరిగింది. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 4248.. బీజేపీ 4,086.. కాంగ్రెస్‌ 89 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల 8 రౌండ్లు ముగిసేసరికి 3,270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఈటెల కోటలో గెల్లు గెలుస్తాడా, గత ఎన్నికల గెలుపు ఫలితాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ఓటు బ్యాంక్ అక్కడ ఎంత, ఈటెలను ఈ సారి ప్రజలు ఆదరిస్తారా..హుజూరాబాద్ గత ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ

బీజేపీ అభ్యర్థి ఈటల ఏడో రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించారు. ఏడు రౌండ్ల తర్వాత బీజేపీ 3,432 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్‌లో ఈటల 246 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 3,792.. బీజేపీ 4,038.. కాంగ్రెస్‌ 94 ఓట్లు సాధించాయి. ఇప్పటిదాకా వెలువడిన అన్ని రౌండ్లలోనూ ఈటలదే ఆధిక్యం. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 31021.. టీఆర్‌ఎస్‌ 27589.. కాంగ్రెస్‌ 1086 ఓట్లు సాధించాయి.

ఆరు రౌండ్ల తర్వాత బీజేపీ 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్‌లో బీజేపీ 4656.. టీఆర్‌ఎస్‌ 3639 ఓట్లు సాధించాయి. ఆరో రౌండ్‌లో బీజేపీ 1017 లీడ్‌ సాధించింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 26,983.. టీఆర్‌ఎస్‌ 23,797.. కాంగ్రెస్‌ 992 ఓట్లు సాధించాయి.

ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా, ఈనెల 14న నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి, హుజూరాబాద్‌లో కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు యుద్ధం జరగబోతుందని తెలిపిన రాజేందర్

ఐదు రౌండ్లు ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండ్‌లో బీజేపీ 4,358.. టీఆర్‌ఎస్‌ 4,014.. కాంగ్రెస్‌ 132 ఓట్లు సాధించాయి. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్‌ఎస్‌ 20,158.. కాంగ్రెస్‌ 680 ఓట్లు సాధించాయి.

నాలుగు రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్‌లో ఈటలకు 562 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 4 రౌండ్ల తర్వాత 1,825 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. నాలుగో రౌండ్‌లో బీజేపీ 4,444.. టీఆర్‌ఎస్‌ 3,882.. కాంగ్రెస్‌ 234 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 17,969.. టీఆర్‌ఎస్‌ 16,144.. కాంగ్రెస్‌ 680 ఓట్లు సాధించాయి.

వరుసగా మూడు రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ వెనుకబడింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 13,525.. టీఆర్‌ఎస్‌ 12,262.. కాంగ్రెస్‌ 446 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 1263 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 182 ఓట్లు వచ్చాయి.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమన్న కేంద్ర మంత్రి, బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్, కండువా కప్పి ఆహ్వానించిన ధర్మేంద్ర ప్రధాన్, ఈటెలతో పాటు కాషాయపు కండువా కప్పుకున్న పలువురు నేతలు

మూడో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యతను కొనసాగించింది. మూడో రౌండ్‌లో 905 ఓట్ల ఆధిక్యం సాధించిన బీజేపీ, మొత్తంగా 1,263 ఓట్ల ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్‌లో హుజూరాబాద్‌ మున్సిపాలిటీ ఓట్లను లెక్కించారు. రెండో రౌండ్‌ముగిసే సమయానికి బీజేపీ 9,461.. టీఆర్‌ఎస్‌ 9,103.. కాంగ్రెస్‌ 339 ఓట్లు సాధించాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 358 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ 4610, టీఆర్‌ఎస్‌ 4444, కాంగ్రెస్‌ 114 ఓట్లు సాధించాయి.

పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది.