TS Assembly Special Session: జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం, తెలంగాణ అసెంబ్లీని ముట్టడించిన బీజేపీ, అసెంబ్లీకి హాజరు కాని కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు
TS Assembly Monsoon Session 2020 (Photo-Telangana CMO Twitter)

Hyderabad, Oct 13: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (Telangana Assembly Special Session ) ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ చట్టాల్లో (GHMC Act Amendment Bill) కొన్ని సవరణలు, హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉండడంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. స‌మావేశాలు ప్రారంభం కాగానే స‌భ‌లో నాలుగు బిల్లుల‌ను (Four Bills) ప్ర‌వేశ‌పెట్టారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ (GHMC) సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. కాగా బిల్లులకు ఇప్పటికే మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది.

స‌భ‌లో ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు - 2020 , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు - 2020 బిల్లులను ఈ రోజు ప్రవేశ పెట్టారు.

జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ బిల్లు సంధర్భంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) మాట్లాడారు. ఈ బిల్లులో భాగంగా వార్డు క‌మిటీల‌ను నియ‌మిస్తున్న‌ట్లు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. న‌గ‌ర అభివృద్ధిలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంచేందుకే వార్డు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా వార్డు క‌మిటీల ఏర్పాటు ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. యూత్ క‌మిటీ, మ‌హిళా క‌మిటీ, సినీయ‌ర్ సిటిజెన్ క‌మిటీ,ఎమినెంట్‌ సిటిజెన్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌మిటీల్లో అన్ని వ‌ర్గాల వారికి అవ‌కాశం వ‌స్తుంది. మూడు నెల‌ల‌కొక‌సారి స‌మావేశాలు నిర్వ‌హిస్తాం. క‌మిటీల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన విధివిధానాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

తెలంగాణలో కొత్తగా మరో 1708 పాజిటివ్ కేసులు మరియు 5 కొవిడ్ మరణాలు నమోదు, హెల్త్ బులెటిన్ గణాంకాలపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు

దీని ద్వారా మొత్తం 5 సవరణలు చేస్తున్నామని వివరించారు. 2015లోనే జీవో ద్వారా జీహెచ్ఎంసీలో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించామని అన్నారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత టీఆర్ఎస్ దేనని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగేందుకు దూసుకుపోతోందని ఆయన చెప్పారు. 1955లోనే హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడిందని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలపాలని గత ప్రభుత్వాలు ఎప్పుడూ భావించలేదని విమర్శించారు. రాష్ట్రంలో హరిత వనాలు పెంచేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 శాతం పచ్చదనం పెరిగిందని ఆయన తెలిపారు. య‌ధాత‌థంగా బీసీల రిజ‌ర్వేష‌న్ కొన‌సాగుతోంది. బీసీల విష‌యంలో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు ఉన్న‌ప్ప‌టికీ 83 మంది బ‌ల‌హీన వ‌ర్గాల సోద‌రుల‌ను గెలిపించుకున్నామ‌ని చెప్పారు.

జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చ‌ట్టానికి ప్ర‌భుత్వం ఐదు స‌వ‌ర‌ణ‌లు చేసింది. ఈ బిల్లును పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వివ‌రంగా స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం బిల్లును ఆమోదిస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, వాయుగుండం నేడు తీరం దాటే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు

ఐదు స‌వ‌ర‌ణ‌లు ఇవే :

1. మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పిస్తూ జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్ర‌త్యేక‌ జీవో ద్వారా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు 50 శాతం స్థానాల‌ను మ‌హిళ‌ల‌కే ఆమోదించుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేయాల‌నే ఆలోచ‌న‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు ఇవాళ చ‌ట్టం చేసుకుంటున్నామ‌ని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో 79 స్థానాల్లో మ‌హిళ‌ల‌ను గెలిపించిన చ‌రిత్ర టీఆర్ఎస్ పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. బీసీల రిజ‌ర్వేష‌న్లు య‌ధాత‌థంగా కొన‌సాగుతాయ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

2. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 10 శాతం గ్రీన్ బ‌డ్జెట్‌కు కూడా స‌భ ఆమోదం తెలిపింది. గ‌తంలో 2.5 శాతం ఉన్న గ్రీన్ బ‌డ్జెట్‌ను 10 శాతానికి పెంచుతున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో 5 నుంచి 6 శాతం గ్రీన్ క‌వ‌ర్ పెరిగింద‌ని కేంద్రం ఓ నివేదిక విడుద‌ల చేసింది. గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో హ‌రిత‌హారం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంద‌న్నారు. పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ చ‌ట్టంలో 10 శాతం బ‌డ్జెట్‌ను గ్రీన్ క‌వ‌ర్‌కు కేటాయించామ‌న్నారు. 85 శాతం మొక్క‌లు బ‌త‌కాల‌నే ఉద్దేశంతో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అప్ప‌జెప్పామ‌న్నారు. పంచాయ‌తీరాజ్‌, పుర‌పాల‌క చ‌ట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లో మార్పులు తీసుకువ‌స్తున్నామ‌ని తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న న‌గ‌రాన్ని హ‌రిత‌న‌గ‌రంగా మార్చేందుకు ఈ స‌వ‌ర‌ణ ఉప‌యోగప‌డుతుంద‌న్నారు.

3. జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లులో భాగంగా 10 ఏళ్ల‌కోసారి రిజ‌ర్వేష‌న్ల మార్పున‌కు స‌భ ఆమోదం తెలిపింది. మాటిమాటికి రిజ‌ర్వేష‌న్లు మార్చ‌డం వ‌ల్ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు జ‌వాబుదారీ త‌నం లేకుండా పోతోంది. రెండు ట‌ర్మ్‌లు ఒకే రిజ‌ర్వేష‌న్ ఉండేలా పంచాయ‌తీరాజ్‌, పుర‌పాల‌క చ‌ట్టంలో తీసుకువ‌చ్చాం. అదే పాల‌సీని జీహెచ్ఎంసీ యాక్ట్‌లో చేర్చ‌తున్నామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీని వ‌ల్ల ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువై అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

4. నాలుగు ర‌కాల వార్డు వాలంటీర్ల క‌మిటీల ఏర్పాటుకు స‌భ ఆమోదం తెలిపింది. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే నాలుగు ర‌కాల క‌మిటీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ క‌మిటీల్లో 50 శాతం మ‌హిళ‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. శ‌క్తివంత‌మైన అస్ర్తంగా ఈ క‌మిటీల‌ను త‌యారు చేయ‌బోతున్నామ‌ని చెప్పారు. న‌గ‌ర అభివృద్ధిలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంచేందుకే వార్డు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా వార్డు క‌మిటీల ఏర్పాటు ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. యూత్ క‌మిటీ, మ‌హిళా క‌మిటీ, సినీయ‌ర్ సిటిజెన్ క‌మిటీ,ఎమినెంట్‌ సిటిజెన్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌మిటీల్లో అన్ని వ‌ర్గాల వారికి అవ‌కాశం వ‌స్తుంది. మూడు నెల‌ల‌కొక‌సారి స‌మావేశాలు నిర్వ‌హిస్తాం. క‌మిటీల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన విధివిధానాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

5. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వాన్ని ఎస్ఈసీ సంప్ర‌దించాల‌ని జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. దీనికి కూడా స‌భ ఆమోదం తెలిపింది.

అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది హాజరు కాలేదు. కాంగ్రెస్ నుంచి సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొందేం వీరయ్యా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభకు హాజరు కాలేదు. ఇక అసెంబ్లీకి బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్.. సమావేశాలకు హాజరు కాలేదు. అధికార పర్టీ సహా, ఎంఐఎం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇదిా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, ,నిరుద్యోగ సంఘాల నేతలు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కారొపరేషన్‌కు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. అయితే, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చనే చట్టసవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ గడువు మరో 10 రోజులు పొడిగింపు, చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం, కేబినెట్‌ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదముద్ర

రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్లకూడదని డిమాండ్ చేశారు. ఇక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. కాషాయ పార్టీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఉదయం నుంచే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

పాతబస్తీలో ఇల్లు నిర్మించుకున్న పేదలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే బాలాల అన్నారు. మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌ తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బాలాల కోరారు. బీఆర్‌ఎస్‌ తీసుకొచ్చి పేదలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.