New Liquor Shops in TS: మద్యం బాబులకు పండగే, కొత్తగా 404 మ‌ద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, డిసెంబ‌ర్ నుంచి నూత‌న మ‌ద్యం విధానం అమల్లోకి
Long Queue Outside Liquor Shop (Photo Credits: Twitter/@Yatharth9815)

Hyd, Nov 8: తెలంగాణ‌లో డిసెంబ‌ర్ నుంచి నూత‌న మ‌ద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో కొత్త‌గా 404 మ‌ద్యం దుకాణాలు (New Liquor Shops in TS) పెంచారు. దీంతో మ‌ద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెంచారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌ల‌కు దుకాణాల కేటాయింపు ప్ర‌క్రియ పూర్త‌యింది. గౌడ్‌ల‌కు 363, ఎస్సీల‌కు 262, ఎస్టీల‌కు 131 దుకాణాల‌ను కేటాయించారు. రేప‌ట్నుంచి ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఈనెల 20న డ్రా ద్వారా లైసెన్సుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. కమిటీ సభ్యులతోపాటు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారుల సమక్షంలో డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 లెక్కన దుకాణాలు కేటాయించినట్లు తెలిపింది. ఈ మూడు క్యాటిగిరీలకు 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు వెల్లడించిన ఆబ్కారీ శాఖ... మిగిలిన 1,864 మద్యం దుకాణాలు(Liquor stores in telangana) ఓపెన్‌ క్యాటగిరి కింద ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 20న డ్రా ద్వారా మ‌ద్యం దుకాణాల‌ను కేటాయించ‌నున్నారు. సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు గౌడ్‌ల‌కు 15 శాతం, ఎస్సీల‌కు 10 శాతం, ఎస్టీల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ శ‌నివారం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో వీటి సంఖ్య 2,620కి పెరిగింది.

ఫాంహౌజ్ దున్నడానికి నీవు డ్రైవర్‌వా, ఓ తోకగానివి, నా ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్‌, బండి సంజయ్‌పై విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడ్, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను(Liquor stores in telangana) లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. డ్, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్యం షాపుల రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. గతంలో నీరా పథకం తీసుకువచ్చి గౌడ్​లకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు.

దుకాణాల యజమానులకు ఈసారి వెసలుబాటు కల్పించామని పేర్కొన్నారు. గతంలో రెండు బ్యాంకులు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పుడు ఒకటే గ్యారంటీ తీసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు కూడా పెంచలేదని... ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామని తెలిపారు. లైసెన్స్ ఫీజు స్లాబులను 8 నుంచి 12కి పెంచామని మంత్రి వెల్లడించారు.

ఇటీవల రాష్ట్రంలో కొత్తగా159 బార్లకు పర్మిషన్‌‌ ఇవ్వగా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మరిన్ని వైన్​ షాపులను తీసుకొస్తోంది. కొత్తగా 404 వైన్స్‌‌కు పర్మిషన్‌‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం వైన్స్​ సంఖ్య 2,620కి చేరనుంది. కొత్త మండలాలతో పాటు మరికొన్ని చోట్ల మద్యం దుకాణాలు తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి ఎక్సైజ్‌‌ పాలసీ మారుతుంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌‌ నెలతో పాలసీ ముగిసినా దీన్ని ఈ ఏడాది నవంబర్‌‌ ఆఖరు వరకు పొడిగించారు.డిసెంబర్‌‌ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది.

కేసీఆర్‌ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందని తెలిపిన బండి సంజయ్

ఈ ఏడాది పాలసీలో భాగంగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాక్‌‌ ఇన్‌‌ స్టోర్స్‌‌లో లిక్కర్‌‌, బీర్ల అనుబంధ యాక్సెసరీస్‌‌ అయిన పెగ్‌‌ మేకర్‌‌, వాటిర్‌‌ బాటిల్స్‌‌, ఐస్‌‌ క్యూబ్స్‌‌, ఐస్‌‌ క్యూబ్‌‌ బకెట్స్‌‌, సోడా, సాఫ్ట్‌‌ డ్రింక్స్‌‌, ఐస్‌‌ క్యూబ్‌‌ టాంగ్స్‌‌, ఓపెనర్స్‌‌ కూడా దొరకనున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటివి నిషేధించారు. అనేక సందర్భాల్లో కేసులూ పెట్టారు. వాకిన్‌‌ స్టోర్స్ ​కోసం వైన్స్‌‌ ఎక్సైజ్ ​ట్యాక్స్​కన్నా 5 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ.55 లక్షలుగా ఎక్సైజ్ ​ట్యాక్స్ నిర్ణయించారు. అలాగే 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు , లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5 లక్ష నుంచి 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.1 కోట్లుగా ట్యాక్స్​ నిర్ణయించారు. ప్రస్తుతం కూడా ఇవే స్లాబులు కొనసాగుతున్నాయి. యాన్వల్‌‌ ఎక్సైజ్‌‌ ట్యాక్స్‌‌ నాలుగు వాయిదాల్లో చెల్లిస్తుండగా ఆరు వాయిదాలకు పెంచనున్నారు. అలాగే ఇప్పటి దాకా టర్నోవర్ ఏడు రెట్లు దాటితే 6.4 శాతం మార్జిన్ మాత్రమే వచ్చేది. కొత్త పాలసీలో 10 శాతానికి పెంచనున్నారు.