Kishan Reddy Fires on KCR: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన కిషన్ రెడ్డి, నీ భాష సరిగా లేదు, ఈ సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోమంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హితవు
G Kishan Reddy (Photo Credits: ANI)

Hyderabad, May 19: ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై (PM Modi Rs 20 Crore Package) సీఎం కేసీఆర్ నిన్న విరుచుకుపడిన సంగతి విదితమే. అయితే కేసీఆర్‌ (TS CM KCR) చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదని హితవు పలికారు. ప్రధాని మోడీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్‌ తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్లుగా ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆర్టీసీ బస్సులు పున:ప్రారంభం సహా దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతి

రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. దేశం మోదీ వెంట నడుస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. మంగళవారం కిషన్ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనా సమయంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అవసరమా? కేంద్రం అద్భుతమైన ప్యాకేజీ ప్రకటించింది. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లబ్ధి జరగదా?. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిధిని 3నుంచి 5 శాతానికి పెంచాం. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ సంస్కరణల్లో లోపాలు ఏమున్నాయో కేసీఆర్‌ చెప్పాలి ఎంఎస్‌ఎంఈలకు కొత్త అర్థం,ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు, రూ. 20 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరగదా? అని ప్రశ్నించారు. ఉన్నంతలో కేంద్రం అద్భుతంగా ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంటల విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదని, అలాంటప్పుడు కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

రైతులు, పేద మహిళల ఖాతాల్లో నగదు. 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం. పెన్షన్లు, ఈపీఎఫ్‌, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే సాయం.. ఇవన్నీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఉపాధి పనులు దినాలు పెంచాం. ఉపాధి నిధులతో తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదా? అని ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో రాజకీయాలను పక్కన పెట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు. ప్రధాని మోదీ 'ఆత్మ నిర్భర్' గుట్టు విప్పిన కేంద్ర ఆర్థికమంత్రి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం ఆధారిత భారతం, ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

కాగా నిన్న మీడియా సమావేశంలో కేంద్రం దుర్మార్గమైన విధానాన్ని అనుసరిస్తుందని, తెలంగాణకు 20 కోట్ల రుణ పరిమితి పెంచి, దరిద్రంగా ఆంక్షలు పెట్టిందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్రం తన పరువు తానే తీసుకుందని, రాష్ట్రాలపై ఈ విధంగా పెత్తనం చేయడం దుర్మార్గం అనిమండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల.. వందశాతం బోగస్‌. నియంతృత్వ ధోరణిలో కేంద్రం వైఖరి ఉంది. రాష్ట్రాలకు నగదు ఇవ్వాలని కోరితే.. రాష్ట్రాలను భిక్షగాళ్లుగా చూసింది. ఇదేనా కేంద్రం చూసే పద్ధతి?’ అని కేంద్ర ప్రభుత్వ తీరుపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.