2020 Coronavirus Pandemic in India (photo-Ians)

New Delhi, Feb 15: దేశంలో దేశంలో గత 24 గంటల్లో 11,649 మందికి కరోనా నిర్ధారణ (India Covid Updates) అయింది. అదే స‌మ‌యంలో 9,489 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 90 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,732 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,21,220 మంది కోలుకున్నారు. 1,39,637 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 82,85,295 మందికి వ్యాక్సిన్ వేశారు.

తెలంగాణలో కొత్త‌గా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 169 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,673 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,379 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,618 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,676 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 705 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 24 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదా...తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు డాక్టర్లకు కరోనా

ఏపీలో గడచిన 24 గంటల్లో 28,788 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 55 మందికి పాజిటివ్ (New COVID-19 Cases) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 9, చిత్తూరు జిల్లాలో 9 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,869 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,972 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 735 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,162గా నమోదైంది. వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

కరోనాతో రెండు తెల్ల పులి పిల్లలు మృతి, బాగా పాడైపోయిన పులి పిల్లల ఊపిరితిత్తులు, జూలో పని చేసే 6 మంది సిబ్బందికి కోవిడ్, పాకిస్తాన్ జూలో విషాద ఘటన

ఇదిలా ఉంటే మ‌హారాష్ట్ర‌లో మళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో 4 వేల పాజిటివ్ కేసులు (Maharashtra Coronavirus) న‌మోదు కాగా.. ఒకే రోజులో 40 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20,64,278కి చేరింది. ఇక ఆ రాష్ట్రంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 51,529కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. నిన్న ఒక్క రోజులోనే సుమారు 1355 మంది రోగుల‌ను డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో రిక‌వ‌రీ కేసుల సంఖ్య 19,75,603కి చేరింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇంకా 35,965 పాజిటివ్ కేసులు ఉన్నాయి. క‌నీసం ల‌క్షా 75 వేల మంది హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. మ‌రో 1747 మంది ఇన్స్‌టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.

వ్యాక్సిన్ తీసుకున్న వైద్యులకు కరోనా, ఐసోలేషన్‌కు వెళ్లిన ముగ్గురు డాక్టర్లు, హిమాచల ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో ఘటన

మ‌హారాష్ట్ర‌లో కోవిడ్ రిక‌వ‌రీ రేటు 95.7 శాతంగా ఉంది. ఇక ఆ రాష్ట్రంలో మ‌ర‌ణాల రేటు 2.5 శాతంగా రికార్డు అయ్యింది. ఆదివారం ఒక్క రోజే 48,782 మందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఆదివారం రోజున ముంబై న‌గ‌రంలో 645 కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రో న‌లుగురు మ‌ర‌ణించారు. నాసిక్‌లో కొత్త‌గా 122 కేసులు, పుణెలో 353, చించ్‌వాడ లో 138 కేసులు న‌మోదు అయ్యాయి. ఔరంగ‌బాద్‌, హింగోలీలో మాత్రం కొత్త కేసులు న‌మోదు కాలేదు. కొల్హాపూర్‌లోని ర‌త్న‌గిరి డివిజ‌న్‌లో ఒక‌రు మ‌ర‌ణించారు. అమ‌రావ‌తి న‌గ‌రంలో 430 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.