Banks Mega Merger: బ్యాంకు కస్టమర్ల అలర్ట్ టైం, ఏప్రిల్ 1 నుంచి మిగిలేది 4 ప్రభుత్వరంగ బ్యాంకులే, విలీనం కానున్న ఆరుబ్యాంకులు, కనుమరుగుకానున్న ఆంధ్రా బ్యాంకు
Merger of 10 public sector banks into 4 to come into effect from Apr 1 (Photo-ANI)

New Delhi, Mar 31: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve bank of india) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) గతంలోప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ వీలీనంతో ఏప్రిల్ 1 నుంచి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు 4 ప్రభుత్వ రంగ బ్యాంకులుగా (Merger of 10 public sector banks into 4) అవతరించనున్నాయి.

యస్ బ్యాంకులో 49 శాతం వాటాల కొనుగులుకు ఎస్‌బిఐ బోర్టు ఆమోదం

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (Punjab National Bank) విలీనం అవుతాయి. అలాగే సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో (Canara Bank) కలిసిపోతుంది. ఇక ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతాయి. అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్‌లో (Indian Bank) కలిసిపోతుంది.

బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియతో 2017లో 27 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12 కు తగ్గిపోతుంది. అందులో 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు ఉంటాయి. విలీనం తర్వాత కస్టమర్లకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఆర్థిక వ్యవస్థకూ మంచిదన్నది కేంద్రం వాదన. బ్యాంకుల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని చెబుతూ వస్తోంది.

కరోనా కల్లోలం, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బిఐ

తెలుగువాళ్లకు సుపరిచితంగా ఉన్న ఆంధ్రా బ్యాంక్ (Andhra Bank) ఇకపై యూనియన్‌ బ్యాంకులో (Union Bank of India) విలీనం కాబోతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారా మయ్య మచిలీపట్నంలో 1923లో స్థాపించిన ఆంధ్రా బ్యాంకు దేశ విదేశాల్లో విస్తరించింది. ఇప్పుడు కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియను చేపట్టడంతో ఈ బ్యాంకు కనుమరుగు కానుంది.

ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్‌బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచులు కెనరా బ్యాంక్ బ్రాంచులుగా మారతాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచులుగా పనిచేస్తాయి.

రూ.110 కోట్ల ఫ్రాడ్ కేసులో అరెస్టయిన మారుతి మాజీ మేనేజింగ్ డైరక్టర్

విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. కాగా ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూడో అతిపెద్ద బ్యాంక్ అవుతుంది. దీని తర్వాతి స్థానంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఉంటాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ అనేవి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులుగా ఉన్నాయి.

అయితే బ్యాంకుల విలీనం తర్వాత సదరు బ్యాంక్ ఖాతాదారులు కంగారుపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ కొన్ని రోజులవరకు వాడుకోవచ్చు. ఏ బ్యాంకులో విలీనం అయితే ఆ బ్యాంకు పేరుతో పాస్ బుక్స్, ఏటీఎం కార్డులు వస్తాయి. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బ్రాంచ్‌లోనే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.బ్రాంచ్‌ల లొకేషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే బ్యాంకులు సమాచారం ఇస్తాయి. మీకు అకౌంట్ ఉన్న బ్రాంచ్‌లోనే ఎప్పట్లాగే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.

అయితే అకౌంట్ బ్యాలెన్స్ లిమిట్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆ వివరాలను ముందే తెలుసుకోవడం మంచిది.రుణాలకు సంబంధించి నియమనిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎలాంటి మార్పులు జరిగినా కస్టమర్లకు సమాచారం వస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఆటో డెబిట్ ఫామ్స్ మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది.బ్యాంకులు విలీనమైనా మీ అకౌంట్‌లో డబ్బులు సురక్షితంగానే ఉంటాయి. బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారే అవకాశం ఉంటుంది.

ఉచిత సేవలు, ఛార్జీలు, డిపాజిట్లకు, రుణాలకు వడ్డీ రేట్లు, మినిమం బ్యాలెన్స్ వివరాలు నేరుగా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోండి.బ్యాంకుల విలీనంపై వచ్చే పుకార్లను అస్సలు పట్టించుకోవద్దు. బ్యాంకుల విలీనం సమయంలో నకిలీ ఇమెయిల్స్, లెటర్స్ సర్క్యులేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎట్టిపరిస్థితుల్లో మీ అకౌంట్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పిన్, కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించకూడదు. ఏ అనుమానం ఉన్నా దగ్గర్లో ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి తెలుసుకోండి.