Amaravathi, January 26: ఆదివారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో ( Telugu States) పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అర్థరాత్రి వేళ భూప్రకంపనలు నమోదయ్యాయి.
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Earth Quake In Telugu States) భూమి ఆరు సెకెన్ల పాటు కంపించిందని స్థానికులు చెబుతున్నారు.
భూకంపం నుంచి రక్షించుకోవడానికి హెల్మెట్లు ధరించిన స్పీకర్, ఎంపీలు
ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ, (Andhra Pradesh) తెలంగాణ (Telangana) సరిహద్దు జిల్లాల్లోని నాగులవంచ, బస్వాపురం, పాతర్లపాడు, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట, నందిగామ, కోదాడ, హుజూర్ నగర్, చింతకాని వంటి చోట్ల భూకంపం సంభవించింది.
దీని తీవ్రతకు కొన్ని గ్రామాల్లో రోడ్లపై చీలికలు ఏర్పడ్డాయి. కొన్ని నివాసాల్లో గోడలకు బీటలు ఏర్పడ్డాయి. దీనితో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
కృష్ణా, గుంటూరు, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు భూకంపం (Earth Quake)బెల్ట్‌లోనే ఉన్నాయంటూ ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఈ మధ్యకాలంలో భూమి ప్రకంపించిన దాఖలాలు లేవు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.
Earthquake In Turkey
Drone footage shows rescue workers searching for survivors trapped under the rubble of collapsed buildings after a powerful quake rattled eastern Turkey https://t.co/0kUokULqsK pic.twitter.com/FJfo3Gr330
— Reuters (@Reuters) January 25, 2020
హైదరాబాద్‌లోనూ (Hyderabad) స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. పాతబస్తీలోని హుస్సేన్ మౌల నూర్‌ఖాన్ బజార్‌లో స్వల్పంగా కనిపించింది. తెల్లవారు జామున 2.30 గంటలకు భూమి కంపించడంతో ఇంట్లో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఈరోజు మరోసారి భూకంపం
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల, రావిరాలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు సర్వసాధారణమే అని జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.
గతేడాది ఫిబ్రవరి 8న ఖమ్మం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 8 రాత్రి 11.23 గంలకు భూమి ఐదు సెకెన్లపాటు కంపించింది. కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలంలో భూప్రకంపనలు సంభవించాయి.
కాగా శనివారం టర్కీలో చోటు చేసుకున్న భూకంపం కారణంగా ఇరవై మంది వరకూ మరణించగా.. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ భూకంప తీవ్రత వల్లే తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు జిల్లాల్లో భూమి కంపించి ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.