TRS Leader EX Sarpanch Venkanna Murder In Suryapet District (Image used for representational purpose)

Suryapet, Febuary 15: తెలంగాణలో (Telangana) దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలు మళ్ళీ భగ్గుమన్నాయి. సూర్యపేట జిల్లాలో (Suryapet District) సహకార ఎన్నికల వేళ పాతకక్షలతో టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు.

ఎర్కారం టీఆర్ఎస్ నేత వెంకన్నను (TRS Leader EX Sarpanch Venkanna) ప్రత్యర్థులు హత్య చేశారు. సహకార ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ (Congress Vs TRS) నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెంకన్నను కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం.

యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఓటర్లను కలుస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాదాపు 20 మంది ప్రత్యర్థి వర్గీయులు మారణాయుదాలతో వెంబడించారు.

వారి నుంచి తప్పించుకున్న వెంకన్న గ్రామానికి చెందిన అవుదొడ్డి వీరయ్య ఇంటిలో దాక్కున్నారు. అక్కడ ఆయన్ని కత్తులతో నరికి, బండ రాయితో కొట్టి హత్య చేశారు. ఇదిలా ఉంటే సహకార ఎన్నికల విషయంపై ఎర్కారం గ్రామంలో రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

అబ్దుల్లాపూర్‌మేట్ హత్య కేసులో రాజకీయ హస్తం

అయితే గత వారం నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గొడవలే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ , కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు మళ్లీ హత్య జరగడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

పెట్రోల్ అందించి ఎమ్మార్వోని హత్య

సహకార ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓటర్లను సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంచగా కాంగ్రెస్ వర్గీయులు అక్కడికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కాంగ్రెస్ వర్గీయులపై తెరాస నాయకులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ గొడవను మనసులో పెట్టుకున్నప్రత్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఉన్న వెంకన్నను అర్ధరాత్రి సమయంలో వెంబడించి హత్య చేశారని వార్తలు అందుతున్నాయి.

భార్య తల నరికాడు, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు

సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. వెంకన్న హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

భార్యను సైనేడ్‌తో చంపేశాడు

కాగా, వెంకన్న హత్యతో గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలు మరోసారి మొదలయ్యాయి. పదిహేనేళ్ల కిందట ఇదే విధంగా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్‌ను హత్య చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. వెంకన్న హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య

మరోవైపు సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు.