Andhra Pradesh: విజయవాడలో అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా, జ్వరంతో పాటు పొత్తి కడుపు, పిరుదులు, కాళ్ళ వెనుక భాగంలో కమిలినట్లు గాయాలు, చికిత్స ద్వారా కోలుకున్న శిశువు, వివరాలను వెల్లడించిన ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పీవీ రామారావు
Newborn| (Photo Credits: IANS)

Vijayawada, June 6: విజయవాడలో అప్పుడే పుట్టిన పాపకు కరోనా లక్షణాలు కనపడ్డాయి. అయిత డాక్టర్లు చేసిన చికిత్సతో (Andhra Hospital Treats Newborn) ఆ పసికందు విజయవంతంగా వ్యాధి నుంచి బయటపడింది. ఈ అద్భుత ఘటన వివరాల్లోకెళితే..విజయవాడలో నివాసం ఉంటున్న బాబ్జీ..తన భార్యకు నెలలు నిండటంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ పుట్టిన మూడు నాలుగు రొజులకు తీవ్రమైన జ్వరం ఎక్కడికక్కడ చర్మం కమిలి పోయినట్టుగా లక్షణాలు కనిపించాయి. దీంతో బాబ్జీ దంపతులు వెంటనే విజయవాడలోని ఆంధ్రా హాస్పటల్‌లో బిడ్డను చేర్చారు.

ఈ లోపే పసిబిడ్డకు పొత్తి కడుపు, పిరుదులతో పాటు కాళ్ళ వెనుక భాగంలో ఎర్రగా కమిలినట్లు గాయాలు ఏర్పడ్డాయి. కొన్ని గాయాలు నల్లగాను, కొన్ని ఎరుపు రంగులో, కొన్ని గాయాలు నీలిరంగులో కనిపించాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు కోవిడ్ టెస్టులు నిర్వహించారు, ఇందులో తల్లి, బిడ్డ ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. అయితే జ్వరం ఎక్కువగా ఉండడం, ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు వంటివి మాత్రం పసిబిడ్డకు వచ్చాయి. డాక్టర్లు ఇతరత్రా టెస్టులు నిర్వహించగా ఆ పరీక్షల్లో యాంటీ బాడీస్‌ని గుర్తించారు.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, తాజాగా 8,976 కోవిడ్ కేసులు నమోదు, 90 మంది మృతి, ప్రస్తుతం 1,23,426 యాక్టివ్‌ కేసులు

దీంతో లక్షణాలు లేకుండానే తల్లికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, ఆమె కోలుకోవడంతో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లి ద్వారా శిశువుకి కూడా యాంటీ బాడీస్ చేరినట్లు గుర్తించారు. నియో నేటల్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. ప్రత్యేక కేసుగా గుర్తించి ఈ శిశువుకి చికిత్స అందించారు. ఇప్పుడు శిశువు ఆరోగ్యం మెరుగుపడుతోంది, సకాలంలో సమస్యను గుర్తించి, తగిన వైద్యం అందించడం ద్వారానే కోలుకోవడానికి అవకాశం ఏర్పడిందని చికిత్స చేసిన డాక్టర్ రామరావు అభిప్రాయపడ్డారు. డాక్టర్లు భూజాత, కృష్ణ ప్రసాద్, మేఘన, బాలకృష్ణ బృందం ఈ శిశువుకి వైద్య సహాయం అందించారు.

కృష్ణపట్నం కరోనా మందు పేరు ఇకపై ఔషధ చక్రం, ఈ పేరునే పరిగణించాలని కోరిన ఆనందయ్య, రేపటి నుంచి జిల్లాలకు 3 రకాల మందు కిట్లు, సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీకి భూమి పూజ చేసిన ఆనందయ్య

కాగా అప్పుడే పుట్టిన పిల్లల్లో చర్మానికి గాయాలు ఏర్పడడం అరుదైన విషయంగా ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్, చిన్న పిల్లల వైద్య విభాగం చీఫ్ డాక్టర్ పీవీ రామారావు తెలిపారు. ఇలాంటి స్థితిని వైద్య పరిభాషలో 'నియోనేటల్ పర్పురా ఫుల్మినన్స్' (Purpura fulminans) అంటారని ఆయన వివరించారు. కాగా పిల్లలలో మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS -C) అని పిలిచే కోవిడ్ సమస్య నవజాత శిశువుల్లో చాలా అరుదని వారు చెబుతున్నారు. 6 వారాల వయసు నిండిన శిశువుల నుంచి పెద్దల్లో ఈ వైరస్ (COVID-19 Multi-System Inflammatory Syndrome) వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పటికీ నవజాత శిశువుల్లో యాంటీబాడీస్ చాలా అరుదుగా భావిస్తున్నారు

దమ్ముంటే రా..నువ్వో నేనో తేల్చుకుందాం, సోమిరెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్, ఎమ్మెల్యేకి, మా వెబ్‌సైట్‌కు సంబంధం లేదని తెలిపిన శేశ్రిత టెక్నాలజీ ఎండీ, నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ

''మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ వల్ల కనీసం 3 కంటే ఎక్కువ రోజుల జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మ గాయాలతో పాటు కొందరికి కళ్ల కలక, గుండె పని చేయక పోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. కొరోనరీ ఆర్టరీ డైలేటేషన్‌తో కొందరు పిల్లలలో అది ఆన్యుయరిజన్‌(రక్త నాళాలు ఉబ్బటం)కి దారి తీస్తుంది. కొందరిలో అపెండిసైటిస్, మూర్ఛలు వంటి సమస్యలు కూడా వస్తాయి.'' అని డాక్టర్ రామారావు వివరించారు.ఇలాంటి లక్షణాలతో ప్రపంచంలోనే చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని, నవజాత శిశువు MIS-C తో కలిపి నియో నేటల్ పర్పురా ఫుల్మినన్స్ అని చెప్పే అరుదైన చర్మ సమస్య ఎదుర్కోవాల్సి రావడం ఇప్పటి వరకూ ఎక్కడా రిపోర్ట్ కాలేదని డాక్టర్ రామారావు వెల్లడించారు.