AP Local Body Election Nomination: గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి, ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు నేటి నుంచే, నామినేషన్‌కు కావాల్సిన అర్హతలు ఓ సారి తెలుసుకోండి
Andhra Pradesh local Body Elections 2020 | (Photo-PTI)

Amaravathi, Mar 09: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా (Andhra Pradesh local Body Elections 2020) మోగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు.

660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు (MPTC, ZPTC) నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈ నెల 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు పరిశీలన.. 13న నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 21న ఎన్నికల పోలింగ్‌, 24న కౌంటింగ్‌ జరగనుంది. 30న జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక.. 30న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు.

ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి..

స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార పార్టీ టిక్కెట్ల కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. గెలుపు గుర్రాల వేటలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు నేతలు వ్యూహరచన చేస్తున్నారు

ఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్

తొలిరోజు నామినేషన్లు తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి నోటిషికేషన్‌ ప్రకటించి ఆ వెంటనే నామినేషన్లు స్వీకారించాలని అధికారులు సూచించారు.

ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

ఇవాళ మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం (Election Commission) నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది. ఒకేసారి 12 కార్పొరేషన్లు, 74 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన 14న తేదీన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరణ 16న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. 23న పోలింగ్ ఉంటుంది. 27న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది.

ఈ నెల 31న 12 కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. అలాగే మున్సిపాలిటీలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిలు ఉంటాయి. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక జడ్పీటీసీ ఎన్నికలకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఉపయోగించనున్నారు.

ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే: నామినేషన్ అర్హతలు ఇవే

ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.కాగా 1994, మే 30కి ముందు మాత్రమే ముగ్గురు పిల్లలు పుట్టి ఉండాలన్నారు. మే తర్వాత మరొక సంతానం ఉంటే పోటీకి అనర్హులవుతారు. 1995, మే 29 తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోటీకి అనర్హులు. అయితే, మొదట ఒకరు పుట్టి, రెండో సంతానంగా కవలలు పుడితే మాత్రం వారు పోటీకి అర్హులవుతారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారికి నామినేషన్ల పరిశీలన జరిగే తేదీ నాటికి కనీసం 21 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. ఎంపీటీసీగా పోటీ చేసేవారు ఆ మండల పరిధిలోని ఏదో ఒక ఎంపీటీసీ పరిధిలో.. జెడ్పీటీసీగా పోటీ చేసే వారికి ఆ జిల్లా పరిధిలోని ఏదో ఒక జెడ్పీటీసీ పరిధిలో ఓటు ఉండాలి. పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వారు కూడా అభ్యర్థి పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో ఓటరై ఉండాలి.

1995, మే 29 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టి, మొత్తం సంతానం ముగ్గురు దాటని వారు కూడా పోటీకి అర్హులే. ముగ్గురు పిల్లలు కలిగి ఉండి, ఒకరిని ఇతరులకు దత్తత ఇస్తే అనర్హులే అవుతారు. ఇప్పటికే ఇద్దరు పిల్లలు కలిగి ఉండి నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి గర్భవతిగా ఉన్నా అలాంటి వారు కూడా పోటీకి అర్హులే. రేషన్‌ షాపు డీలరుగా పనిచేసే వారు పోటీకి అర్హులే.

అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు. దేవదాయ శాఖ పరిధిలో ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్‌ లేదంటే సభ్యులుగా ఉన్న వారు పోటీకి అనర్హులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేసేవారు ఆ పరిధిలో ఓటు కలిగి ఉండి, ఏదైనా పట్టణ ప్రాంతంలో మరొక ఓటు కలిగి ఉన్నా అర్హులే. ఇలాంటి వారిని అనర్హులుగా పేర్కొనడానికి చట్టంలో ప్రత్యేకంగా ఏ నిబంధన లేని కారణంగా వారిని అర్హులగానే పరిగణిస్తారు.