Election Code In AP: ఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్, ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు, హింసకు తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకోండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వెల్లడి
AP State Election Commissioner N Ramesh Kumar (Photo-Twitter)

Amaravati, Mar 07: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections 2020) సమరానికి వేళయింది. దీంతో అక్కడ తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ (State Election Commissioner, N Ramesh Kumar) ప్రకటించారు. ఎన్నికల సంఘం పోల్ షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ (Model Code of Conduct (MCC)) అమల్లోకి వచ్చేసింది. ఈ కోడ్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏం చెయ్యవచ్చో, ఏం చెయ్యకూడదో క్లియర్‌గా స్పష్టం చేస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రావడంతోనే ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అంటే స్కీముల్లో మార్పులు, చట్టాల్లో సవరణలు, కొత్త పథకాలు తీసుకుని రావడం చెయ్యకూడదు.ఎన్నికలు సజావుగా జరగాలంటే రాజకీయ పార్టీలూ, నేతలూ కొన్ని రూల్స్ పాటించాలి. వాటినే ఎన్నికల నిబంధనావళి అంటున్నారు.

ఈ రూల్స్‌లో రాజకీయ నేతలు (Political Leaders) చేసే ప్రకటనలు, ప్రసంగాలు, పోలింగ్ తేదీలు, పోలింగ్ బూత్‌లు, శాఖలు, ఎన్నికల మేనిఫెస్టోలు, సంప్రదాయంగా వస్తున్న అంశాలు అన్నీ ఉంటాయి. వీటిని పక్కాగా పాటిస్తే, ఎన్నికలు సజావుగా సాగుతాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల నియమావళి విధిగా పాటించాలి. ప్రభుత్వ సంబంధించిన సదుపాయాలను ఉపసంహరించుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను అమలు చేయరాదు.

ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

కొత్తగా బదిలీలు, నియమాకాలు చేపట్టరాదు. ఎన్నికలు సజావుగా జరపడానికి కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇచ్చాం. స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలి. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్ లో ఉంది కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోం.సిబ్బంది కొరతలేదు.. అత్యవసరం అయితే అంగన్ వాడి వర్కర్స్ ని వాడుకుంటాం’ అని రమేశ్‌ కుమార్‌ అన్నారు.

కరోనాపై ప్రజలను ఆందోళనకు గురి చేయకండి

కాగా రాష్ట్రంలో మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు, రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి.

ఎన్నికల షెడ్యూల్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ

మార్చి 12: నామినేషన్ల పరిశీలన

మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 21: ఎన్నికల పోలింగ్‌

మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌

మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ

మార్చి 14: నామినేషన్ల పరిశీలన

మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 23: ఎన్నికల పోలింగ్‌

మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌

మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ

మార్చి 20: నామినేషన్ల పరిశీలన

మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 27: ఎన్నికల పోలింగ్‌

మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌

మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ

మార్చి 22: నామినేషన్ల పరిశీలన

మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 29: ఎన్నికల పోలింగ్‌

మార్చి 29: ఓట్ల లెక్కింపు