Brahmamgari Matham Dispute: బ్రహ్మంగారి మఠం వద్ద హైటెన్షన్‌, శివస్వామి నిర్ణయం కరెక్ట్ కాదని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, చట్టప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం, కొనసాగుతున్న బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి సస్పెన్స్
AP Endowment Minister Vellampalli Srinivas (Photo-ANI)

Kadapa, June 14: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ (Brahmamgari Matham Dispute) కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం వెళ్తామని మంత్రి (AP Minister Vellampalli Srinivas) స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలని తెలిపారు. పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

శివస్వామి (Sivaswamy) ముందుగా నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, ఏదైనా చట్టప్రకారమే జరగుతుందని అన్నారు. కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీల్‌కు వెళ్తామన్నారు. ఒక కోర్టులో వ్యతిరేకంగా తీర్పు రాగానే గెలిచినట్లు కాదన్నారు. మేం ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా వెళ్తామని అన్నారు. ఇదిలా ఉంటే చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం (Veera Brahmendra Swamy Jeeva Samadhi) ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్‌ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది.

కుటుంబాన్ని కాటేసిన కరోనా, రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి, ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తాజాగా 12,492 మంది కోలుకుని ఇంటికి, కొత్తగా 6,770 మందికి కరోనా పాజిటివ్‌

ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్‌ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్‌పర్సన్‌ (పర్సన్‌ ఇన్‌చార్జి)గా వైఎస్సార్‌ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌ బాలాజీని నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు.

మళ్లీ చైనాలోనే..గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్, గబ్బిలాల జాతుల నుంచి 24 కొత్త క‌రోనా వైర‌స్ జీనోమ్‌ల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన చైనా శాస్త్రవేత్తలు

సమావేశానంతరం మంత్రి వెలంపల్లి ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మఠం పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీలైనంత త్వరగా మఠాధిపతి ఎంపికపై మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలాంటి విద్వేషాలకు తావులేకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మంత్రి కోరారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1693లో జీవ సమాధి అయ్యాక, అప్పటి నుంచి వారి వంశమే మఠాధిపత్యం స్వీకరిస్తూ వచ్చిందని.. ఇలా ఇప్పటివరకు 11 మంది కొనసాగారని ఆయన తెలిపారు. ప్రస్తుత మఠాధిపతి మే 8న పరమపదించారని.. ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరి భార్యల వారసులు పీఠాధిపతి స్థానానికి పోటీపడడంతో వివాదం ఏర్పడిందన్నారు.

ఇరుపక్షాలు తమ వద్ద వీలునామాలు ఉన్నాయని చెబుతున్నాయని.. కానీ, ఇప్పటివరకు ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందలేదని మంత్రి వెలంపల్లి చెప్పారు. నిబంధనల ప్రకారం.. వీలునామా రాసిన 90 రోజుల వ్యవధిలో దానికి ఒక విన్నపాన్ని జతపరిచి దేవదాయ శాఖకు అందజేయాల్సి ఉందని.. అయినా ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందనందున తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇదో ప్రమాదకర కేసు.. మనిషి మెదడులో క్రికెట్ బాల్ సైజులో బ్లాక్ ఫంగ‌స్‌, మూడు గంటలు పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు, స‌ర్జ‌రీ త‌ర్వాత నిల‌క‌డగా పేషెంట్ ఆరోగ్యం

వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నందున మఠాధిపతి ఎంపిక సంప్రదాయ బద్ధంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. పీఠాధిపతి ఉన్నప్పుడే తదుపరి ఉత్తరాధికారిని ప్రకటించి ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేదే కాదన్నారు. దేవదాయ శాఖ పరిధిలో 128 వరకు మఠాలు, పీఠాలు ఉన్నాయని.. వాటిలో బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలు కలిగిన ఇతర మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని.. కమిటీ సూచనలను ధార్మిక పరిషత్‌ పరిశీలించి తదుపరి మఠాధిపతి ఎంపిక పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. కమిటీ సమావేశం నిర్వహణకు 30 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సమావేశం నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చని వెలంపల్లి చెప్పారు.

రఘురామకు సీఎం జగన్ టీం భారీ ట్విస్ట్, రియల్ ఫేస్ రఘురాజు అంటూ ట్విట్టర్లో వీడియోని ట్వీట్ చేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు, రఘు రామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు మరో సారి ఫిర్యాదు చేసిన ఎంపీ మార్గాని భరత్

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతిగా శివైక్యం చెందిన మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామిని ధర్మపరిరక్షణ సమితి నిర్ణయించిందని గుంటూరు జిల్లా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారి మఠంలో సమితి సభ్యులు, వివిధ మఠాలకు చెందిన 20 మంది పీఠాధిపతులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి ఎంపికలో వారసత్వానికే హిందూ మతం ప్రాధాన్యతనిస్తుందని.. వీలునామాలకు ఆస్కారం లేదని ఆయన తేల్చిచెప్పారు.

ధర్మపరిరక్షణ సమితి సభ్యులమైన తాము ఏ మఠంలో సమస్యలున్నా వాటిని పరిష్కరించడమే తమ బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా ధర్మపరిరక్షణ సమితి భక్తులు, కందిమల్లాయ్యపల్లె గ్రామస్తులు, ఉప పీఠాలు, వివిధ మఠాధిపతులతో సంప్రదింపులు జరపగా అధిక శాతం వారసత్వానికే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వారి సలహాలు, సూచనలు ఇచ్చారని శివస్వామి చెప్పారు. ధర్మపరిరక్షణ సమితి కూడా వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించాలని భావిస్తోందని.. ఇదే విషయంపై దేవదాయశాఖ పరిధిలో ఉన్న ధార్మిక పరిషత్‌కు నివేదిక ఇస్తామన్నారు.

తిరుమలలో భక్తులకు ఇక వసతి లభ్యత మరింత సులభతరం, జూన్ 12 నుంచి అందుబాటులోకి రానున్న నూతన బుకింగ్ కౌంటర్లు; శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం సీజే ఎన్వీ రమణ

ఇక మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని శివస్వామి తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనపై ఒత్తిడి రావడంతోనే మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారని వివరించారు. అలాగే, మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఇంతవరకు కనిపించకపోవడంపై శివస్వామి అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాక.. మఠంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయని.. వీటన్నింటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం మఠాధిపతి నియామకాన్ని పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద సోమవారం టెన్షన్‌ నెలకొంది. విశ్వబ్రాహ్మణ సంఘం ఛైర్మన్‌ శ్రీకాంత్‌ ఆచారిని మఠం నాయకులు అడ్డుకున్నారు. మఠం వివాదంపై మీడియాతో మాట్లాడుతున్న శ్రీకాంత్ ఆచారిపై దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల రంగ ప్రవేశంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. కాగా పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే.

ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది.