Coronavirus Outbreak. | (Photo-PTI)

Amaravati, June 13: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,02,876 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,770 మందికి కరోనా పాజిటివ్‌గా (coronavirus cases) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,06,949 మందికి కరోనా వైరస్‌ (Coronavirus in AP) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 58 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,940కు (Covid Deaths) చేరింది. గడిచిన 24 గంటల్లో 12,492 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 12 వేల 267 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.ఏపీలో ప్రస్తుతం 85,637 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,04,50,982 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మళ్లీ చైనాలోనే..గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్, గబ్బిలాల జాతుల నుంచి 24 కొత్త క‌రోనా వైర‌స్ జీనోమ్‌ల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన చైనా శాస్త్రవేత్తలు

చిత్తూరు జిల్లాలో కరోనాతో 12 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. అనంతపురం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కడప, కృష్ణా, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

ఇదో ప్రమాదకర కేసు.. మనిషి మెదడులో క్రికెట్ బాల్ సైజులో బ్లాక్ ఫంగ‌స్‌, మూడు గంటలు పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు, స‌ర్జ‌రీ త‌ర్వాత నిల‌క‌డగా పేషెంట్ ఆరోగ్యం

అమలాపురంలో ఓ కుటుంబాన్ని కరోనా కాటేసింది. 20 రోజుల కిందట ఒక కొడుకు, శుక్రవారం మరో కొడుకు, కొద్దిసేపటికే తల్లి కన్నుమూయడం ఆ కుటుంబంలో కల్లోలం రేపింది. స్థానిక మార్కెట్‌లో పాన్‌షాప్‌ నిర్వహిస్తూ జీవిస్తున్న పుప్పాల వెంకటేశ్వరరావు ఆరు నెలల కిందట బైపాస్‌ సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిది ఉమ్మడి కుటుంబం. 20 రోజుల కిందట ఆయన పెద్ద కుమారుడు స్వామినాయుడు కరోనాతో కన్నుమూశారు.

దేశంలో భారీగా తగ్గుతున్న రోజూవారీ కేసులు, తాజాగా 80,834 మందికి కరోనా, కరోనా కట్టడికి ప్రపంచమంతా ఏకతాటిపై నడవాలని కోరిన ప్రధాని మోదీ, కేంద్రం సరైన వ్యూహాలను రచించాలంటే మృతుల సంఖ్య కచ్చితత్వంతో ఉండాలని తెలిపిన రణ్‌దీప్‌ గులేరియా

తరువాత భార్య నాగమణి, రెండో కుమారుడు వెర్రియ్యనాయుడు కరోనా బారిన పడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం వారిద్దరూ మృతి చెందారు. మృతి చెందిన ఆ ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల్లో మరికొందరు కరోనాతో బాధ పడుతున్నారు. దీంతో వెంకటేశ్వరరావు దిక్కుతోచని స్థితిలో కుమిలి కుమిలి రోదిస్తున్నారు.