Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, May 13: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల (AP COVID-19 Report) సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తోంది . ఏపీలో గడిచిన 24 గంటంల్లో కొత్తగా 48 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో (Andhra Pradesh) పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కు చేరింది. రూ.20 లక్షల కోట్లలో ఏ రంగానికి ఎంత కేటాయింపులు, సాయంత్ర 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు వెల్లడించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

గత 24 గంటల్లో అనంతపూర్‌లో 3, చిత్తూరులో 11, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 12, కృష్ణాలో 3, కర్నూల్‌లో 7 కేసులు నమోదు కాగా, 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో (AP coronavirus Deaths) 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 1142 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 948గా ఉంది.

Here's AP Corona Report

ఏప్రిల్‌ 15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆందోళన పెంచిన కరోనా కేసులు (AP coronavirus) మే 1 నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. గత 12 రోజుల్లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గత 12 రోజుల్లో 648 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 735 మంది కోవిడ్ 19 నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు.  మా నీళ్లను మేము తీసుకుంటున్నాం, దీనిపై రాజకీయాలు చేయడం తగదు, కృష్ణా జ‌లాల అంశంపై స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఏప్రిల్‌లో అత్యధికంగా ఒకే రోజు 82 కేసుల వరకు నమోదైన కేసుల సంఖ్య బుధవారం 48 కేసులకే పరిమితమైంది. ఏపీలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్, పరిమిత సంఖ్యలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ఆన్‌లైన్ ద్వారానే టికెట్ల కొనుగోలు

ఓవైపు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కేసులు రాను రాను తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకుంటోంది. ఏపీలో విద్యుత్ బిల్లుల మోత, ఏ మాత్రం నిజం లేదు,లాక్‌డౌన్‌ కారణంగా 60 రోజులకు మీటర్ రీడింగ్ తీసాం, మీడియాకు వెల్లడించిన ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1,91,874 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల రేటు 4.02 శాతం నమోదవుతుంటే.. ఏపీలో 1.07 శాతంగా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు రికార్డు స్థాయిలో 51.49 శాతంగా నమోదయ్యింది.