Coronavirus Outbreak in China (Photo Credits: IANS)

New Delhi, February 27: చైనాలో పుట్టిన కరోనా వైరస్ (Coronavirus Outbreak) మృత్యుఘోష ప్రపంచమంతా వినిపిస్తోంది. చైనాలో (China) విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా ఇప్పుడు దునియా మొత్తం చుట్టివేసింది. కరోనావైరస్ మృతుల సంఖ్య 2,744కు చేరినట్టు చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రారంభ కేంద్రమైన హుబేయి ప్రావిన్స్‌లోనే అత్యధిక మరణాలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

కోవిడ్-19 నుంచి భారీ ఉపశమనం

కాగా ఎన్‌హెచ్‌కే వరల్డ్ మీడియా సంస్థ కథనం ప్రకారం తాజాగా చైనాలో మరో 433 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ సోకిన మొత్తం చైనీయుల సంఖ్య 78,497కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 81,200గా ఉంది. ఇప్పటి వరకు 30 వేల మందికి పైగా ఈ వైరస్ బారినపడి మళ్లీ కోలుకున్నారు. వీరిలో 2,600 మందిని గడచిన 24 గంటల్లోనే విముక్తి పొందడం విశేషం.

ఇదిలా ఉంటే భారత పౌరులకు (Indian nationals) కేంద్ర హోం, ఆరోగ్య మంత్రిత్వశాఖలు (Health Ministry) తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాల్లోనూ కొవిడ్-19 ప్రబలిన నేపథ్యంలో భారత పౌరులు అనవసరంగా ఆయా దేశాలకు వెళ్లవద్దని కేంద్ర హోం,ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కోరాయి. దక్షిణ కొరియాలో 1100 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.

కరోనా పని పట్టాలంటే 18 నెలలు ఆగాల్సిందే

ఇరాన్ దేశ రాజధాని టెహరాన్ నగరంతోపాటు ఆ దేశంలో కొవిడ్ తో 19 మంది మరణించారు. ఇటలీ దేశంలోనూ ఈ వైరస్ సోకింది. దీంతో ఈ దేశాలకు భారత పౌరులు వెళ్లవద్దని భారత సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

జపాన్ విహార నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో కొవిడ్-19 వ్యాప్తితో నిర్బంధానికి గురైన 119 మంది భారతీయులను ఎయిర్ ఇండియా విమానంలో గురువారం న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. విహారనౌకలో కొవిడ్ వ్యాప్తితో నిర్బంధానికి గురైన భారత పౌరులను ఖాళీ చేయించి తీసుకువచ్చేందుకు సహకరించిన జపాన్ అధికారులకు భారత సర్కారు కృతజ్ఞతలు తెలిపింది. న్యూఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 119 మంది భారతీయులతోపాటు ఐదుగురు శ్రీలంక, నేపాల్, దక్షిణ ఆఫ్రికా, పెరూ దేశాల జాతీయులున్నారు.

ఘోస్ట్ నగరంగా మారిన చైనా

జపాన్ దేశానికి చెందిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో మొత్తం 3,711 మంది ఉండగా వారిలో 132 మంది భారత సిబ్బంది, ఆరుగురు భారత ప్రయాణికులు. విహారనౌకలో జరిపిన పరీక్షల్లో కొందరికి కొవిడ్ -19 పాజిటివ్ అని రావడంతో ఈ నెల 5వతేదీ నుంచి నౌకలోనే నిర్బంధించి చికిత్స అందించారు.

నౌకలోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన ఎయిర్ ఇండియాను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభినందించారు. చైనా దేశంలోని వూహాన్ నగరం నుంచి కూడా ఎయిర్ ఇండియా 640 మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చిన సంగతి విదితమే.

అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్

కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావిత ప్రాంతమైన చైనాలోని వుహాన్‌ ప్రాంతానికి భారత్‌ సుమారు 15 టన్నుల మందులను పంపింది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన విమానంలో బుధవారం ఈ మందులను తరలించారు. వుహాన్‌కు వెళ్లేందుకు భారత్‌కు చెందిన విమానాలకు అనుమతులివ్వడంలో చైనా కావాలనే ఆలస్యం చేస్తోందని గత వారం భారత్‌ ప్రకటించడం తెల్సిందే. విమానం తిరిగొస్తూ 80 మంది భారతీయులు, చుట్టుపక్కల దేశాల నుంచి 40 మందిని భారత్‌కు తీసుకురానుంది. విమానంలో మాస్కులు, గ్లోవ్స్, ఇతర అత్యవసర వైద్య పరికరాలను పంపిస్తున్నట్లు తెలిపింది.

External Affairs Minister's Tweet:

ఇదిలా ఉంటే ఇరాన్ ఆరోగ్య మంత్రి ఇరాజ్ హారిర్చీకి (Iran Deputy Health Minister) కరోనా టెస్ట్‌లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో తాను కరోనాపై పోరాడి గెలుస్తానంటూ చెప్పారాయన. ఇరాజ్‌ని ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఐసోలేషన్ వార్డ్‌లో చికిత్స చేస్తోంది. వైరస్ ఎలా సోకిందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. వైరస్ సోకిన రోగులను కలిసిన సమయంలో..తనకు ఈ వ్యాధి వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Here's Video

తాను ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నానని, ప్రస్తుతం తాను ధ్యానం చేస్తున్నట్లు వెల్లడించారాయన. కొన్ని వారాల్లో వైరస్‌పై ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. వైరస్ చాలా ప్రమాదకరమని, ఇరాన్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో కరోనా బారిన పడి 16 మంది చనిపోయారని, 95 మందికి ఈ వైరస్ సోకిందని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

అమెరికాలోని మోడెర్నా అనే బయోటెక్ సంస్థ కరోనాకి వేక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. తొందర్లోనే దీన్ని టెస్ట్ చేయబోతున్నట్లు కూడా ఈ సంస్థ ప్రకటించింది. ఈ విషయం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.