Telangana Police Rescued 73 People After They Were Found Locked In A Room Of An Old Age Home (photo-ANI)

Nagaram, January 25:తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Telangana Capital Hyderabad) నగర శివారులోని నాగారంలో (Nagaram village) గల శిల్పానగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం పేరుతో (Old Age Home) ఓ సంస్థ అక్రమంగా మానసిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకే గదిలో 73 మందికి పైగా వృద్ధులను ఉంచుతూ సంస్థ నిర్వాహకులు.. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.

ఈ విషయాన్ని స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పునరావాస కేంద్రంపై దాడి చేసిన పోలీసులకు (Telangana Police) నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. మానసికంగా బాధపడేవారిని బాగుచేస్తామంటూ.. వృద్ధాశ్రమ నిర్వాహకులు రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది.

తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

అంతేకాదు.. బాధితులను గొలుసులతో కట్టేసి.. వారికి నరకయాతన చూపిస్తున్నట్లు వెల్లడైంది. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆశ్రమ నిర్వాహకులపై సీనియర్ సిటిజన్ యాక్ట్ 2017 (Senior Citizens Act 2007) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Here's ANI Tweet

వృద్ధులకు కనీసం ఫోన్ సౌకర్యం కూడా కల్పించకుండా వారిని గొలుసులతో బంధించారు. తమని ఇంటికి పంపించాలని వృద్ధులు వేడుకుంటున్నా కనికరం చూపించలేదు.తమని ఇంటికి పంపించాలని వృద్ధులు వేడుకుంటున్నా కనికరం చూపించలేదు. వృద్ధులను ఇంటికి పంపిస్తే తమకు రావల్సిన ఫండ్స్ ఆగిపోతాయని పాస్టర్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కేటీఆర్

బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం శిల్పనగర్‌ లో గత కొంత కాలంగా వృద్ధాశ్రమం పేరుతో ఓ సంస్థ అక్రమంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మానసికంగా బాగులేని వారని బాగుచేస్తాం అని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చెప్పిన మాట వినకుంటే నరకం చూపించేవారు.

3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య

శరీరంపై నిప్పుతో కాల్చేవారని బాధితులు ఆరోపించారు. పది నుంచి పదిహేను మంది ఉండాల్సిన గదిలో 73 మందిని నిర్భంధించేవారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గొలుసులతో కట్టేసి దారుణంగా హింసించే వారని ఆవేదన వ్యక్తం చేశారు.

మృగాళ్ల వేటలో మరో మహిళ మృతి

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత నిర్వాహకులకు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మల్కాజిగిరి డిసీపీ రక్షిత మూర్తి, ఏసీపీ శివకుమార్ బాధితులను నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.

విషాదంగా ముగిసిన దీప్తి శ్రీ కథ

మరోవైపు ఈ అక్రమ ఆశ్రమంలో యువత కుడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బరువు తగ్గడం కోసం వచ్చిన వారిని తిండి పెట్టకుండా నరకం చూపిస్తారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాధితులను మెడికల్ పరీక్షల అనంతరం సంబంధిత కేంద్రాలకు తరలించారు.

అమెరికాలో హైదరాబాదీ యువతిపై అత్యాచారం

మానసిక పరివర్తన కల్పిస్తామని చెప్పడంతో మద్యానికి బానిసైన వారిని కూడా కొందరు చేర్పించారు. వృద్ధులతో పాటు యువకులను సైతం ఇదే ఆశ్రమంలో చేర్పించారు. 52 పురుషులతో పాటు 21 మంది మహిళలు ఈ ఆశ్రమంలో ఉంటున్నారు.