Amaravati, April 15: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 కేసులు (AP Coronavirus) సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రొజు కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు ( coronavirus-positive-cases) నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి బుధవారం ఉదయం వరకు జరిగిన కరోనా నిర్దారణ పరీక్షలో పశ్చిమ గోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకున్న 16 మంది డిశార్జ్ కాగా, 11 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 475 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు మృతిచెందారు.
కరోనాతో ఏపీలో డాక్టర్ మృతి, నెల్లూరులో తొలి మరణం
కరోనా మహమ్మారి (COVID-19) విస్తరిస్తున్న తరుణంలో వైరస్ నిర్ధారణ శాంపిళ్లను వేగంగా పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ – 19 కేసులు పెరగకుండా ప్రాథమిక దశలోనే చెక్ పెట్టేందుకు ట్రూనాట్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Here's ANI Tweet
19 more #COVID19 cases reported in Andhra Pradesh (8 in West Godavari, 6 in Kurnool, 4 in Guntur, & 1 in Krishna district). Total number of positive coronavirus cases in the state is now at 502, including 475 active cases, 16 discharged & 11 deaths: State's COVID19 Nodal Officer pic.twitter.com/62D2VUjlcU
— ANI (@ANI) April 15, 2020
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏపీ సర్కారు గుడ్ న్యూస్
ఈ ఆధునిక పరికరాలతో జిల్లాలో పరీక్షలను వేగంగా నిర్వహించి కేసులను త్వరితగతిన గుర్తించే అవకాశం లభించింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది శాంపిళ్లను సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
డాక్టర్‌పై కరోనా పేషెంట్ బంధువుల దాడి
ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని గోపాల్ నగర్‌కు చెందిన వ్యక్తికి నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చింది. అనారోగ్యంతో నెల్లూరులో చికిత్స కోసం చేరాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అధికారులు కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలకు స్వాబ్‌ను తీసి పంపించడంతో పాజిటివ్‌గా నిర్ధారణయింది. సమాచారం తెలుసుకున్న ప్రకాశం జిల్లా అధికారులు బాధితుని ఇంటికి చేరుకుని అనుమానితులను క్వారంటైన్‌కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఏపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 42గా నమోదయ్యాయి. అనుమానిత వ్యక్తుల నుంచి ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో మంగళ వారం 13 నివేదికలు నెగటివ్‌గా నిర్ధారణయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లాలో 949 శాంపిల్స్ సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు. వీటిలో 694 నివేదికలు అందాయి. వీటిలో 41 పాజిటివ్ కాగా, 653 కేసులు నెగటివ్‌గా నిర్ధారణయ్యాయి. నెల్లూరులో నమోదయిన ఒంగోలు కేసుతో కలిపి పాజిటివ్‌ల సంఖ్య 42కు చేరింది.