CM KCR in the State Assembly | File Photo

Hyderabad, Sep 8: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు (TS Assembly Session 2020) రెండో రోజు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ ప్ర‌శ్నోత్త‌రాలను ర‌ద్దు చేశారు. అసెంబ్లీలో పీవీ శతజయంతి ఉత్సవాలపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు భారత రత్న (Bharat Ratna to former Prime Minister PV Narasimha Rao) ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు.

నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ (PV Narasimha Rao)మన ఠీవి అని ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అని వివరించారు.హైదరాబాద్‌లో ఉన్నసెంట్రల్‌​ యూనివర్సిటీకి పీవీ పేరు (PV name for Central‌ University) పెట్టాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.

నూతన రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుకు తెలంగాణ కేబినేట్ ఆమోదం, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

గ్లోబల్‌ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావని.. దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని తెలిపారు. పీవీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రణబ్‌ ముఖర్జీని ఆర్థిక మంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. పీవీ నాటిన సంస్కరణ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం తెలిపారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడురు.

ఈ నెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకి భారత రత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. సంక్షోభాల సమయంలో చాకచాక్యంగా పీవీ పాలన చేశారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని భట్టి పేర్కొన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం

అదే విధంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలిచినవారే చరిత్రను రాస్తారని తెలిపారు. పీవీ స్థాయికి తగ్గ విధంగా భారత ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటమని పీవీ చెప్పారని గుర్తు చేశారు.

కరోనా నెగెటివ్ ఉంటేనే అసెంబ్లీలోకి ఎంట్రీ

నేడు అసెంబ్లీలో నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లును మంత్రి సబితారెడ్డి సభలో పెట్టనున్నారు. తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌-2020, తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్స్‌బిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు -2020, ఆయుష్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల పదవీవిరమణ వయోపరిమితి పెంపు బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు.