Telangana: తెలంగాణలో 766కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఒక్కరోజులోనే 66 కేసులు నమోదు, జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి
COVID-19 in Telangana. | File Photo

Hyderabad, April 18: తెలంగాణలో నిన్న ఒక్కరోజే 66 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుండి ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఇది రెండో అతిపెద్ద సంఖ్యగా చెప్పవచ్చు. ఏప్రిల్ 03 న ఒక్కరోజులోనే 75 కేసులు నివేదించబడ్డాయి. ఆ తరువాత ఏప్రిల్ 5న 62 పాజిటివ్ కేసులు, ఏప్రిల్ 13న 61 కేసులు, ఏప్రిల్ 16న గురువారం 50 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈరోజు ఏప్రిల్ 18, శనివారం ఉదయం నాటికి తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. గత 6 రోజుల్లోనే రాష్ట్రంలో కొత్తగా 263 మందికి కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఒక్క హైదరాబాద్ నగరం నుంచే శుక్రవారం 46 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలోని లైబ్రరీలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనావైరస్ సోకటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. యాకుత్ పురకు చెందిన ఆ వ్యక్తి ఇంటి సమీపంలో దిల్లీ వెళ్లి వచ్చిన వారు ఉండటంతో అధికారులు ఆ ప్రాంతంపై దృష్టి పెట్టారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే మొత్తం 417 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 131 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

 జిల్లాల వారీగా కేసుల వివరాలు:

COVID-19 in Telangana

 

సూర్యాపేట జిల్లాలో కోవిడ్-19 విజృంభిస్తుంది. శుక్రవారం ఒకరోజే 15 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 45కు చేరింది.  20 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన, ఆదివారం సమావేశం కానున్న రాష్ట్ర కేబినేట్

మరోవైపు మంచిర్యాల జిల్లాలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు, మరణం నమోదైంది. చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన 48 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలు బయటపడటంతో ఆమెను హైదరాబాద్ తరలించారు. అయితే చికిత్సకు ముందే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతురాలి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.