AP Shocker: 15 నిమిషాల్లో ఆరుమందిని ఇష్టం వచ్చినట్లు నరికిన కిరాతకుడు, వరుస హత్యలతో ఉలిక్కిపడిన జుత్తాడ గ్రామం, వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే కారణమంటున్న పోలీసులు, ఘటనపై తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం, నిందితుడి అప్పలరాజుకి 14 రోజుల రిమాండ్
Image used for representational purpose only. | File Photo

Vishakhapatnam, April 16: విశాఖ నగర శివారులోని వాలిమెరక జుత్తాడ గ్రామం హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాతకక్షల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కిరాతకంగా హత్య Andhra Pradesh Shocker) చేయడంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. జుత్తాడ నుంచి విజయవాడ వెళ్లి నివసిస్తున్న సివిల్‌ కాంట్రాక్టర్‌ బొమ్మిడి విజయ్‌కిరణ్‌ కుటుంబ సభ్యులు ఆరుగురిని అదే గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు అతి కిరాతకంగా హత్య (Murder) చేశాడు.

ఉదయం 5.45 గంటల సమయంలో వాకిలి కడిగేందుకు బయటికి వచ్చిన విజయ్‌ అత్త అల్లు రమాదేవి (63)పై అక్కడే మాటువేసి ఉన్న అప్పలరాజు ఒక్క ఉదుటున వచ్చి ఈత కల్లు కత్తితో దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామం నుంచి కోలుకోకముందే మెడపై వేటు పడటంతో ఆమె కుప్పకూలిపోయింది. చేతిని నరికేసి.. ఇంటి లోపలికి వెళ్లి నిద్రలో ఉన్న విజయ్‌ భార్య బొమ్మిడి ఉషారాణి (35), ఆమె ఇద్దరు పిల్లలు బొమ్మిడి ఉదయనందన్‌(02), బొమ్మిడి రిషిత (06 నెలలు)ను కిరాతకంగా హత్య (6 Family Members Assassinated) చేశాడు. పిల్లలిద్దరి మెడపై బలంగా కత్తితో వేటేశాడు.

ఉషారాణి పొట్టపై విచక్షణారహితంగా నరికి పేగులు బయటికి తీసేశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన విజయ్‌ మేనత్త నెక్కళ్ల అరుణ (45) బాత్‌రూమ్‌లో ఉన్న విజయ్‌ తండ్రి బమ్మిడి రమణ (63) వద్దకు పరుగులు తీసింది. బాత్‌రూమ్‌ డోర్‌ కొట్టింది. అంతలో ఆమె మెడపై దాడి చెయ్యడంతో రమణ డోర్‌ తీసిన వెంటనే అరుణ కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రమణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది.

ఇంత కర్కశమా..కోడలు ఉరేసుకుంటుంటే..ఆపకుండా ఉరిని వీడియో తీసిన అత్తమామలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, ఉత్తర ప్రదేశ్‌‌లోని ముజఫర్‌ నగర్‌లో దారుణ ఘటన

కుటుంబంలో అందర్నీ కత్తితో అతి కిరాతకంగా నరికేసి, అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. బయటకు వచ్చిన అప్పలరాజు.. రమాదేవి మృతదేహం పక్కనే అరగంట సేపు కూర్చున్నాడు. ఆ తర్వాత 100 నంబర్‌కు డయల్‌ చేశాడు. ‘జుత్తాడ గ్రామంలో ఆరుగురిని చంపేశాను. నేను ఇక్కడే ఉన్నాను. లొంగిపోతాను’ అంటూ తాను చేసిన నరమేధం గురించి చెప్పగా.. అక్కడి నుంచి పెందుర్తి పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు.

Here's Updates

బాధితుడు బమ్మిడి విజయ కిరణ్‌ తాతయ్య చెల్లుబోయిన అప్పారావుది శివాజీపాలెం కావడంతో హత్యకు గురైన ఆరు మృతదేహాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు మృతదేహాలను కేజీహెచ్‌ నుంచి శివాజీపాలెం తీసుకొచ్చారు. అప్పటికే పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లుసిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి మహాప్రస్థానం వాహనాల్లో అప్పారావు ఇంటికి మృతదేహాలు చేరుకోగా కనీసం వాటిని కిందకు దించలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి అటే శ్మశానవాటికకు తరలించారు.

ఈ ఘటనలో అప్పలరాజుకు అతడి కుటుంబ సభ్యుల సహకారం ఉందని బాధితుల తరఫున బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధితుల ఆరోపణల నేపథ్యంలో మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఘటనాస్థలిని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టారు.

ఆన్‌లైన్‌ క్లాస్‌..బాలిక నోరు నొక్కేసి అత్యాచారం, ఆపై వీడియో తీసి పలుమార్లు లైంగిక దాడి చేసిన ఇంటి ఒనర్ కొడుకు, జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో దారుణ ఘటన

పెందుర్తి లోని వి.జుత్తాడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు బత్తిన అప్పలరాజు(48)కు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పెందుర్తి సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు. అప్పలరాజును శుక్రవారం సాయంత్రం మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా పూర్తి స్థాయి విచారణ చేసి రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారన్నారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షల సమయంలో హత్యలు ఎందుకు చేశావని నిందితుడ్ని మీడియా ప్రశ్నించగా.. తన కన్న కూతుర్ని లైంగికంగా వేధించడంతో ఈ హత్యలు చేశానని బదులిచ్చాడు.

ఆరుగురి హత్యకు కారణాలేంటి..?

వివాహేతర సంబంధంతో ఐదేళ్ల కిందట ప్రారంభమైన గొడవలే ఈ హత్యలకు దారి తీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అప్పలరాజు కుమార్తెకు అదే గ్రామంలో నివాసం ఉంటున్న బమ్మిడి విజయ్‌కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొద్ది సంవత్సరాలుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ కుటుంబంపై పగ పెంచుకున్న అప్పలరాజు ఈ దారుణానికి ఒడగట్టినట్లుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు.

అప్పలరాజు కుమార్తెతో.. విజయ్ ఫోన్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన తండ్రి..ఆ యువకుడిపై 2018లో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ను అప్పట్లో అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ విజయ్‌పై, అతని కుటుంబంపై పగ పెంచుకున్న అప్పలరాజు బుధవారం అర్ధరాత్రి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.

తొమ్మిది మంది భార్యలతో ఎంజాయ్, చివరకు రెండో భార్య కొడుకు చేతిలో చావుకు దగ్గరగా వెళ్లాడు, మదనపల్లెలో ఘటన, కేసు దర్యాప్తు చేస్తున్న మదనపల్లె పోలీసులు

ఆరు హత్యలకు వివాహేతర సంబంధం ఒక కారణం కాగా.. స్థానికుల సమాచారం ప్రకారం ఆస్తి తగాదాలూ ఇంకో కారణమని తెలుస్తోంది. పోలీసులు సైతం ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విజయ్‌ ఇంటి పక్కన ఉన్న స్థలం హంతకుడు అప్పలరాజుకు చెందినది కాగా.. ఎదురుగా ఉన్న ఇల్లు అప్పలరాజు సోదరుడికి చెందినది. మధ్యలో విజయ్‌ ఇల్లు ఉండటంతో దాన్ని అమ్మేయాలని పలుమార్లు అడిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా దాన్ని అమ్మేందుకు విజయ్‌ తండ్రి రమణ నిరాకరించడం, దానికి తోడు వివాహేతర సంబంధం బయటపడటం.. అప్పలరాజులో పగని పెంచింది. దాని వల్లే ఈ మారణహోమానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రూంలో బ్యాచిలర్స్ గొడవ, కూరగాయలు కట్ చేయలేదని ఫ్రెండ్‌పై కత్తితో దాడి, స్నేహితుని పరిస్థితి విషమం, హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

కేవలం పావు గంటలోనే నాలుగేళ్ల పగని నర హంతకుడు అప్పలరాజు తీర్చుకున్నాడు. ఉదయం 5 గంటల నుంచి ఆయుధంతో వేచి ఉన్న హంతకుడు అప్పలరాజు... 5.30 గంటలకు రమాదేవి తలుపు తీసిన వెంటనే.. హత్యాకాండ మొదలు పెట్టాడు. పిల్లా.. పెద్దా అనే తేడా లేకుండా విచక్షణ కోల్పోయి సైకోలా మారిపోయాడు. గేటు దగ్గర మొదలుపెట్టి.. వంటగది వరకూ సాగిన మారణహోమం పావుగంటలో ముగిసిపోయి.. ఆరుగుర్ని విగతజీవులుగా మార్చేసింది. 5.45 గంటలకు బయటికి వచ్చిన కిరాతకుడు.. అరగంట పాటు రమాదేవి మృతదేహం పక్కనే కూర్చొని 6.15 కి 100 నంబర్‌కు డయల్‌ చేశాడు. 100 నుంచి 108కి ఫోన్‌ వెళ్లగా.. హుటాహుటిన అక్కడికి వెళ్లిన 108 సిబ్బంది వెళ్లే సరికి.. అటు ఇటూ తిరుగుతూ ఎవరొస్తారో రండి అంటూ హంతకుడు కత్తితో అటు ఇటు పచార్లు చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.

ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ద్వారా సమాచారం అందుకున్న రాజ్యసభ సభ్యుడు వి.విజయ్‌సాయిరెడ్డి బాధితుడు విజయ్‌కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. జరిగిన ఘటనను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆగ్రాలో దారుణం, యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ఇద్దరు నపుంసకులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధిత యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ గేట్ పోలీసులు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలకు ఘనంగా నివాళి అర్పించి జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. విజయ్‌ను ఓదార్చారు. ప్రభుత్వం తరపున సహకరిస్తామని చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి భర్త గొలగాని శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా యాదవ సంఘాల ప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

పల్లెల్లో వేకుకజామున 5 గంటలకే సందడి మొదలవుతుంది. కానీ గ్రామం నడిబొడ్డున జరిగిన మృత్యుఘోష ఎవరికీ వినపడలేదా అనే అనుమానాలు అందరిలోనే వ్యక్తమవుతున్నాయి. విజయ్‌ ఇంటి పక్కనే హంతకుడి సోదరుడి కుటుంబం నివశిస్తోంది. చుట్టుపక్కల ఇళ్లల్లో జనం ఉన్నా ఎవరికీ హాహాకారాలు వినిపించలేదా అనేది ప్రశ్నగా మారింది. హంతకుడు 5 గంటల నుంచి ఆయుధంతో మాటు వేసినా ఎవరూ గుర్తించలేదా.? హత్యలు చేసి అరగంట ఆరుబయట కూర్చున్నా ఎవరూ పట్టించుకోలేదా.? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పక్కనే ఉన్న సోదరుడి కుటుంబం ఆ సమయంలో ఏం చేస్తున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నారు.