AP Cabinet Meeting: 3 రోజుల్లో తేలిపోనున్న ఏపీ రాజధాని భవిష్యత్తు, ఈ నెల 27న విశాఖలో క్యాబినెట్ మీటింగ్, స్వాగతించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా, చంద్రబాబుకి సవాల్ విసిరిన స్పీకర్ తమ్మినేని, అమరావతిలో కొనసాగుతున్న నిరసనలు
Ap Cabinet meeting in Visakhapatnam on December 27 (Photo-Twitter)

Amaravathi, December 24: మరో మూడు రోజుల్లో ఏపీ రాజధాని భవిష్యత్తు తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Ap Cabinet Meeting) డిసెంబర్ 27న విశాఖలో జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ఏపీ రాజధాని అంశంపై ఓ స్పష్టత రానుంది. విశాఖలో(Visakhapatnam) కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈ కేబినెట్ భేటీలోనే ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.

ఏపీ రాజధాని అమరావతిపై జీఎన్‌ రావు కమిటీ (GN Rao Committee)ఇచ్చిన నివేదికను ఈ భేటీలో ఓకే చేస్తారా లేక మరో నిర్ణయం తీసుకుంటారా అనేది తేలిపోనుంది. ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కేబినెట్ భేటీలోనే రాజధానిపై (AP Capital) తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ రాజధానిపై పలుసూచనలు చేసిందని వాటిపై కేబినెట్ లో చర్చిస్తామని ఆయన తెలిపారు.

ఎన్‌ఆర్సీపై బీజేపీకి ఏపీ సీఎం షాక్, రాష్ట్రంలో ఎన్‌ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదు

రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అమరావతిలో భూములు అభివృద్ధి చేసి ఇస్తామని ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బాబు మోసం చేస్తున్నారని, మోసపూరిత మాటలను నమ్మవద్దని బొత్స అమరావతి ప్రజలకు సూచించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ కొనసాగుతుందని బొత్స చెప్పారు.

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) స్పష్టం చేశారు. విశాఖ వాసిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనపై తాను స్పందిస్తున్నానని, ఇది మంచి ఆలోచన కావడంతో హర్షం వ్యక్తం చేశానని తెలిపారు.

తెరపైకి రాజధానిగా తిరుపతిని తీసుకువచ్చిన చింతా మోహన్

ఈ విషయంలో పార్టీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నా.. విశాఖవాసిగానే తన స్పందన తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం అని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరం సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు. అమరావతి రైతులకి తగిన న్యాయం చేయాలని కోరారు.

దమ్ముంటే ఇవి చెప్పగలవా: చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సవాల్

విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని చంద్రబాబుకి సవాల్ విసిరారు. విశాఖపట్నంలో కార్య నిర్వాహక రాజధాని వద్దని, కర్నూలులో హైకోర్టు వద్దని చంద్రబాబు చెప్పగలరా? అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే విశాఖ, కర్నూలులో అభివృద్ధి వద్దని చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది ?, ఏపీ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ?,ఇప్పటి వరకు నాయకులు ఏమన్నారో వారి మాటల్లో...

అక్కడ కనీస వసతులు కూడా లేవని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడని, ఆయనకు అన్ని ప్రాంతాల ప్రజలూ ఒకటేనని, అందరినీ సమాన భావంతోనే చూస్తారని చెప్పారు. కొంతమందిని తీసుకుని మంగళగిరి ప్రాంతంలో టీడీపీ ధర్నాలు చేయిస్తోందని ఆరోపించిన తమ్మినేని, విశాఖ, కర్నూలు అభివృద్ధిని చంద్రబాబు కోరుకోవడం లేదా? అని ప్రశ్నించారు.

రాజధానిని పూర్తి స్థాయిలో విశాఖకు తరలించడం లేదు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

అమరావతి రైతుల ఆందోళనను తప్పుపట్టడం న్యాయం కాదని వ్యాఖ్యానించారు. రాజధానిని పూర్తి స్థాయిలో విశాఖకు తరలించడం లేదని... అమరావతితో పాటు విశాఖ కూడా ఒక రాజధానిగా ఉంటుందని చెప్పారు. అమరావతి రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు.

తెరపైకి 25 జిల్లాలను తీసుకువచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి

రాజధాని అంశానికి కేబినెట్ ఆమోదం లభించాలని, అసెంబ్లీలో ఆమోదం పొందాలని... అప్పుడు కానీ పూర్తి క్లారిటీ రాదని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధానిగా అమరావతికి కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయని... ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అమరావతి రైతులు కోరడంలో తప్పు లేదని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

రాజధాని ప్రాంతల్లో నిరసనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాజధాని ప్రాంతల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రైతులు నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా రూపొందిస్తామన్న వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు వంటా-వార్పు కార్యక్రమాన్ని కూడా రోడ్లపై నిర్వహించనున్నారు. రాజధాని ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై పోలీస్ స్టేషన్లలో కనబడట్లేదంటూ కంప్లైంట్లు చేస్తున్నారు.

అమరావతిలోనే అసెంబ్లీ..రాజభవన్, విశాఖలో సచివాలయం,సీఎంఓ,వేసవి అసెంబ్లీ,హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, సంచలన విషయాలను బయటపెట్టిన జీఎన్ రావు కమిటీ

తెలుగుదేశం ఎంపీ కేశినేని నానీ

ఎన్‌ఆర్సీకు వ్యతిరేకమంటూ జగన్ చేసిన ప్రకటనపై లేటెస్ట్‌గా తెలుగుదేశం ఎంపీ కేశినేని నానీ సెటైర్లు వేశారు. జగన్ అన్న నువ్వు సూపర్ అంటూ ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నానీ, రోజుకో ట్వీట్‌తో విరుచుకుపడుతున్నారు. జగనన్న నువ్వు సూపర్ అన్న. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో CABకు అనుకూలంగా ఓటేపిస్తావు.

Here's Tweet

ముస్లింల ఓట్ల కోసం NRCకి వ్యతిరేకం అంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న. హ్యాట్సాఫ్ అన్నా అంటూ ఎద్దేవా చేశారు. అలాగే అమరావతిని ఎడారితో పోల్చిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కూడా ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో టార్గెట్ చేశారు. అమెరికాలో లాస్ వేగాస్ నగరాన్ని ఏడారిలోనే నిర్మించారని.. ఒకసారి అక్కడికి వెళ్లి చూసి రా నాయనా అంటూ సలహా ఇచ్చారు. ఎడారిలో కూడా అద్భుతాలు ఎలా సృష్టించ వచ్చో తెలుస్తుందని అన్నారు.

నేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

రాజధానిపై సినీ రచయిత చిన్నికృష్ణ

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంశంపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ స్పందించారు. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్‌ మంచి ఆలోచన అని, ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ అమరావతిలోనే జరిగిందని చిన్నికృష్ణ సంచనల వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే చెప్పారని విమర్శించారు.