AP Politics: టీడీపీకి భారీ షాక్, వైసీపీలోకి వెల్లువలా చేరికలు, పులివెందులలో సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీ తీర్థం
File images of AP CM Jagnmohan Reddy and Opp Leader Chandrababu Naidu | Photo - PTI

Amaravati, Mar 10: స్థానిక ఎన్నికలకు ముందే ఏపీలో టీడీపీకి (TDP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఏపీ రాజకీయ ముఖచిత్రం (AP Politics) ఇప్పుడు పూర్తిగా హాట్ హాట్ గా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ (YSRCP) కంచుకోట పులివెందులలో (Pulivendula) అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

సీఎం జగన్‌తో పరిమల్‌ నత్వానీ, రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు

ఆ పార్టీకి చెందిన కీలక నేత, నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి (Satish Reddy) మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పదవిని కూడా ఆయన వదులుకున్నారు.

తెలుగు దేశం పార్టీని (Telugu desam Party) వీడుతున్నట్లు తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు (Chandra Babu) వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉంటున్నా సరైన ఆదరణ లభించలేదని తీవ్ర ఆవేదనన చెందారు.

ఏపీలో ఫలించిన అంబానీ వ్యూహం

తన మనసును చంపుకొని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. 20 ఏళ్లుగా కష్టపడి పనిచేసినా ఆదరణ లేకపోవడంతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సతీష్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు 

మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు (Kadiri Babu Rao) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS jagan) సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నమ్మించి మోసం చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిట్ట అని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట ఇస్తే మడమతిప్పని నాయకుడు అని అన్నారు. సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు తెలిపారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీవీకి కేంద్రం షాక్

2019 ఎన్నికల్లో చంద్రబాబు కనీసం తనకు చెప్పకుండా దర్శికి పంపి.. బలవంతంగా అక్కడి నుంచి పోటీ చేయించారని గుర్తుచేశారు. బాలకృష్ణ చెప్పిన మాటను చంద్రబాబు పట్టించుకోలేదు. బాలకృష్ణపై అభిమానంతోనే ఇంతకాలం టీడీపీలో కొనసాగనని చెప్పారు. బాలకృష్ణ మంచి వ్యక్తి అని వ్యాఖ్యానించారు.

వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

వీరితో పాటుగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు సమక్షంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్‌ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌ కుమార్‌, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు పేర్లు  ఇవే

ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్‌లు వైఎస్సార్‌సీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కూడా మంగళవారం వైఎస్సార్‌సీలో చేరారు.

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన అన్నారు. అయితే, దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో తేల్చుకోవాలంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

ఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్

'సీఎం జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణతిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ.. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే' అంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి ముందుకు వెళ్తున్నాయి.

కడపలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతిపాదన

ఎవరికి బలం ఉన్నచోట వారు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారితో ఇప్పుడు సీపీఐ కూడా కలుస్తోంది. ఇప్పటికైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. నాలుగేళ్ల తర్వా త వచ్చే ఎన్నికల గురించి ఆలోచించడం తర్వాత. ముందు స్థానిక సంస్థల ఎన్నికలపై నారా లోకేష్‌ దృష్టి పెడితే మంచిది’ అని హితవు పలికారు.

ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు, ఈడీ దాడులు జరిగినా వాటి మూలాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరకట్ట నివాసంలో బయట పడుతున్నాయని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో దోచుకున్న సొమ్మును దాచుకుని దేశం దాటించేందుకు ఎస్‌ బ్యాంక్‌ను వాడుకున్నారని ఆరోపించారు. ఆ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు దగ్గర తేలుతున్నాయన్నారు.

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో కలసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారన్నారు. టిట్కో ద్వారా చదరపు అడుగుకు రూ.1,100 చొప్పున నిర్మించాల్సిన పేదల ఇళ్లకు రూ.2,400 ప్రకారం చెల్లించి చంద్రబాబు రూ.వేల కోట్ల ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఆ సొమ్ము ఎస్‌ బ్యాంకు ద్వారా విదేశాలకు హవాలా రూపంలో తరలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

పోలవరంపై కేంద్రం తీపికబురు, 2021కల్లా పూర్తి 

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో బాబు మెజారిటీ సీట్లు గెలవలేకపోయారు. సతీష్‌రెడ్డి , డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రెహమాన్ టీడీపీకి ఎందుకు రాజీనామా చేశారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజీనామా చేసిన సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు.

వైపీసీ ఎమ్మెల్యే ఆర్థర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని, టీడీపీ ఖాళీ అవుతుందని వైపీసీ ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నందికొట్కూర్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా అన్ని స్థానాలను కైవసం చేసుకుని సీఎం జగన్‌కు బహుమతిగా అందిద్దామని పిలుపునిచ్చారు.

విశాఖలో అమరావతి మెట్రో రైల్ కార్యాలయం

బాబుకు అభ్యర్థులు దొరకడం లేదన్న రామచంద్రయ్య

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. బీజీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. చంద్రబాబుకు నిజాయితీ లేదని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు తోట త్రిమూర్తులు

ఈ సంధర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సీఎం జగన్‌ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబును చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీలో మోసపూరిత వైఖరి నెలకొందని విమర్శించారు.