Amaravati, April 7: రాష్ట్రంలో కరోనావైరస్ (coronavirus on AP) ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో కరోనా నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) మంగళవారం సమీక్ష నిర్వహించారు.
లాక్‌డౌన్‌ను పొడగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం?
క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి (Special Chief Secretary KS Jawahar Reddy), ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకూ 150 మందికి కోవిడ్ 19 (Covid 19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకే పాజిటివ్ కేసు వచ్చిందని తెలిపారు. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గొచ్చని భావిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా, మొత్తం 15 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి
ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు నిర్వహించగా.. 196 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో కాంటాక్ట్ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3 నుంచి 4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి పరీక్షలు నిర్వహించగా.. 84 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 280 కేసులు ఢిల్లీ వెళ్లివచ్చినవారితో సంబంధాలున్నవే. విదేశాల నుంచి వచ్చిన వారికి 205 మందికి పరీక్షలు చేయగా..11 మందికి పాజిటివ్ అని తేలింది. వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు చేయగా.. 6 గురికి పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలుగా భావించిన వారిలో 134 మందికి పరీక్షలు చేస్తే 7గురికి పాజిటివ్ అని తేలింది.
17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్ మత ప్రకంపనలు
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలన్న దానిపై ఈ సమీక్షా సమావేశంలో (AP CM YS Jagan Review) చర్చ జరిగింది. కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
మళ్లీ 14 కొత్త కేసులు, ఇద్దరు మృతి, ఐదుగురు రికవరీ
హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వేపైన కూడా దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన పద్ధతిలో ర్యాండర్ సర్వేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి మోదీ ఫోన్
ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ క్వారంటైన్లలో సుమారు 5300కు పైగా ప్రజలున్నారని అధికారులు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇంకా 19,247 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
వీరి ఐసోలేషన్ పీరియడ్ ముగిసిందని, ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ కొనసాగిస్తున్నామని అధికారులు చెప్పారు. వీరు కాక మరో లక్ష మంది హోం క్వారంటైన్‌లో.. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.